దిశ హత్య కేసులో నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు మరో 9 హత్యలు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ, కర్నాటక జాతీయ రహదారులపై గతంలో 15మంది మహిళలపై అత్యాచారంచేసి తగులబెట్టిన ఘటనలపై పోలీసులు విచారిస్తున్నారు. వాటిలో ఆరిఫ్, చెన్నకేశవులు కలిసి 9 మందిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నిందితులను ఈ నెల 4,5 తేదీల్లో కస్టడీలోకి తీసుకొని విచారించినప్పుడు... ఈ విషయాలు బయటపడినట్లు సమాచారం.
డీఎన్ఏ, వేలిముద్రల విశ్లేషణ
15 హత్య కేసుల్లో ఆయా సమయాల్లో క్లూస్ టీం అధికారులు సేకరించిన వేలిముద్రలు, డీఎన్ఏ రిపోర్టులను సైబరాబాద్ పోలీసులు... దిశ నిందితుల డీఎన్ఏతో పోల్చుతున్నారు. ఘటనా స్థలిలో దొరికిన వేలిముద్రలను విశ్లేషిస్తున్నారు. ఒకవేళ దిశ హత్య కేసు నిందితుల డీఎన్ఏ, వేలిముద్రలతో... ఇతర హత్య కేసుల్లో ఆధారాలతో పోలిస్తే... పోలీసులు వాటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: 'దిశ' నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్