ETV Bharat / state

మండలిలో బడ్జెట్​పై చర్చ పూర్తి.. రేపు మంత్రి సమాధానం

బడ్జెట్​పై మండలిలో సాధారణ చర్చ ముగిసింది. విద్యా, వైద్య సేవలపై ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంపై మంత్రి వేముల వివరణ ఇచ్చారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై శ్రీనివాస్ గౌడ్​ వివరించారు. ఆర్టీసీ అధికారుల తీరుపై మంత్రి పువ్వాడ క్షమాపణలు కోరారు. బడ్జెట్​పై ఆర్థికమంత్రి హరీశ్ రావు రేపు సభలో సమాధానం ఇవ్వనున్నారు.

discussion on budget complete in council and finacne mnister harish rao replay tomarrow
మండలిలో బడ్జెట్​పై చర్చ పూర్తి.. రేపు మంత్రి సమాధానం
author img

By

Published : Mar 12, 2020, 11:09 PM IST

Updated : Mar 12, 2020, 11:29 PM IST

శాసనమండలిలో బడ్జెట్​పై ఇవాళ సాధారణ చర్చ ముగిసింది. దీనిపై ఆర్థికమంత్రి హరీశ్ రావు రేపు సమాధానం ఇవ్వనున్నారు. పలు ప్రధాన శాఖాలకు బడ్జెట్​లో సరైన నిధులు కేటాయించలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా గంధంగూడాలోని 3.22 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైన మాట వాస్తవమేనని... గోపన్​పల్లిలో జరిగిన భూదందాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

'డబుల్​' ఇళ్లు పూర్తి చేస్తాం

శాసన మండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్​పై సాధరణ చర్చ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 వేల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. మరో మూడు నెలల్లో లక్ష 16 వేల ఇళ్లు పూర్తి అవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల 89 వేల ఇళ్లు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. డబుల్ బెడ్ రూముల ఇళ్ల నిర్మాణం కోసం 7 వేల 500 కోట్లు ఖర్చు చేస్తే 6 వేల 800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిందని వివరించారు. కేంద్రం ఇవ్వాల్సిన వాటా విడుదల చేయలేదన్నారు.

మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం

రవాణా మంత్రి క్షమాపణ

ఆర్టీసీ అధికారులు తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని ఎమ్మెల్సీలు ఆరోపించారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్​ సభలో క్షమాపణ చెప్పారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడం అధికారుల తప్పేనన్నారు. ఆర్టీసీ పార్సిల్ సర్వీసుల ద్వారా ఏడాదికి 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. నెలాఖరుకు ప్రారంభించేందుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తున్నామన్నారు.

పెరిగిన ఆర్టీసీ ఆదాయం

ఆర్టీసీకి గతంలో 11 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే... ఇప్పుడు 12.50 కోట్లు వస్తుందన్నారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు 235 కోట్లు చెల్లించినందుకు... ఆర్టీసీ ఐకాస నాయకులే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీపీఎస్​ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని వివరించారు.

పర్యాటకాభివృద్ధి చర్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లాను టూరిజం సర్క్యూట్​గా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు తెలిపారు. రామప్ప ఐలాండ్​ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యాటక శాఖ చేస్తున్న అభివృద్ధిలో భాగంగా... బోగత, మేడారం, తాడ్వాయి, సోమశిల, నాగార్జునసాగర్ వద్ద కాటేజ్​ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం కల్పించామన్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణం సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.

విద్యా, వైద్య సేవలపై అసంతృప్తి

కంటి వెలుగులో శస్త్రచికిత్సలు చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, విశ్వవిద్యాలయాల్లోని ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాద్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 50 వేల వరకు ఉన్న రుణమాఫీని ఒక దఫాలో, అంతకంటే ఎక్కువ ఉంటే రెండు విడతల్లో చేయాలని కోరారు.

ఇవాళ వాయిదా పడ్డ మండలి... రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభంకానుంది. ప్రశ్నేత్తరాలు లేకుండా బడ్జెట్​పై హరీశ్​ రావు సమాధానం ఇవ్వనున్నారు. తర్వాత పట్టణ ప్రగతి, కరోనా అంశాలపై లఘు చర్చ నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: బోయింగ్ సిములేటర్ కాక్​పిట్​లో కేటీఆర్

Last Updated : Mar 12, 2020, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.