Discounts on Traffic E Challan in Telangana : తెలంగాణలో పెండింగ్ చలానాల చెల్లింపునకు, వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కాలంగా ట్రాఫిక్ ఉల్లంఘనల బకాయిలు పేరుకుపోవడంతో, ప్రభుత్వం రాయితీతో చెల్లింపులు చేసుకోవాలని కోరింది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
పెండింగ్ చలానాలపై చెల్లింపుకు అనూహ్య స్పందన : తాజాగా ప్రభుత్వం డిసెంబర్ 25 వరకూ ఉన్న పెండింగ్ చలాన్లపై (Discounts on Traffic E Challan in Telangana) రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెల 26 నుంచి జనవరి 10 వరకూ మాత్రమే చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, టీఎస్‌ఆర్టీసీ బస్సులు 90 శాతం ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించటంతో వాహనదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
Discount On Challan : వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్..!
ఇప్పటి వరకూ రూ.66.77 కోట్ల చెల్లింపులు : ఈ మేరకు 11 రోజుల వ్యవధిలోనే, రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి, దాదాపు రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయిని అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ పరిధిలో రూ.17 కోట్లు, సైబరాబాద్ పరిధిలో రూ.13.99 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.7.17 కోట్ల చెల్లింపులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ అవకాశం మరో ఐదు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ ఎం.విశ్వప్రసాద్ (Traffic Additional CP Vishwaprasad) తెలిపారు. సైబర్ నేరస్థులు ఇటీవల నకిలీ వెబ్‌సైట్‌తో బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని జాగ్రత్తగా చెల్లింపులు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు పెండింగ్ చెల్లింపు విషయంలో ఎటువంటి సందేహం ఎదురైనా 040-27852721, వాట్సాప్ 8712661690 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసుకోవాలని విశ్వప్రసాద్ వివరించారు.
CHALLANS: రూ.600 కోట్ల పెండింగ్ చలాన్లు.. వసూలు కోసం రాయితీలు
Traffic Pending Challans in Telangana : మరోవైపు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, చలానాలు విధించడం సులభమైంది. ఈ చలానాలను చాలా మంది చెల్లించడం లేదు. అయితే పోలీసులు తనిఖీలు నిర్వహించి, వాహనం నంబర్ ఆధారంగా చలానాలను (Pending Challans in Telangana) పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు బయటపడుతున్నాయి.
గతేడాది మార్చి 31 నాటికి తెలంగాణలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇచ్చింది. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ క్రమంలో దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ చలాన్లు వసూలయ్యాయి. దాదాపు 65 శాతం మంది చలానాలు చెల్లించారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ భూతం - అధికారులు చలానాలకే పరిమితం - వాహనదారులకు తప్పని నరకం
అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటారో ఇక అంతే..