ETV Bharat / state

అంగ వైకల్యం శరీరానికే.. ఆత్మవిశ్వాసానికి కాదు - Amuth story

Software job for disabled young man in Amazon : చిన్ననాడు ఆ కుర్రాడిని చూసి అయ్యో అన్నవారే నేడు ఔరా అంటున్నారు. కారణం దివ్యాంగుడైన ఆ యువకుడు.. నిండైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సాఫ్ట్‌వేరు కొలువు సాధించాడు. పుట్టుకతోనే వంకర్లు తిరిగిన చేతులు.. కాళ్లు, శరీరం ఒకే చోట ఉండటంతో.. పూర్తిగా మంచానికే పరిమితమైన పరిస్థితి అతగాడిది. ఐనా అవయవాలు లేవని కుంగిపోలేదు. నడవలేనని ఇంట్లోనే ఆగిపోలేదు. రాయలేనని.. చదువూ ఆపలేదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం దిశగా అడుగులేశాడు. ఫలితంగా అమెజాన్‌లో ఉద్యోగం సాధించి నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అమృత్‌.

Amruth is a software employee
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమృత్‌
author img

By

Published : Feb 14, 2023, 7:38 PM IST

అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోని అమృత్

Software job for disabled young man in Amazon: పుట్టుకతో వంకర్లు తిరిగిన చేతులు, కాళ్లు. శరీరం మొత్తం ఒకేచోట. అదీనూ అడుగు తీసి అడుగేయలేని స్థితి. మంచం మీద నుంచి కదల్లేని దీనస్థితి. తల, రెండు చేతుల్లోని చూపుడు వేళ్లు మాత్రమే పనిచేస్తాయి ఈ యువకుడికి. కాళ్లు, చేతులు కదపాలన్నా.. మరొకరి సాయం కావాల్సిందే. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నిండైన ఆత్మవిశ్వాసంతో లక్ష్యం దిశగా అడుగులేసి అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ కొలువు సాధించాడు.

5 సంవత్సరాలు వచ్చిన నడక రాలేకపోవడంతో ఆందోళన: ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన యువకుడి పేరు అమృత్‌. మొదటి సంతానంలో కుమారుడు జన్మించడం పట్ల యువకుడి తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఏడాది వరకు బాలుడి బుడిబుడి అడుగులు చూసి మురిసిపోయారు. ఐదేళ్లు గడిచినా నడకలో తడబాటు, ఎదుగుదలలో లోపం కనిపించడంతో వైద్యులను సంప్రదించారు. లక్షలు ఖర్చు చేశారు. ఎక్కడికెళ్లినా అమృత్ ఎదుగుదలలో ఫలితం లేకుండా పోయింది.

ఇరుగుపొరుగు వారు మాటలు బాధ కలిగించాయి: తొలి సంతానంగా జన్మించిన పిల్లవాడి పరిస్థితిని చూసి అమృత్‌ తల్లిదండ్రులు కన్నీరు- మున్నీరయ్యారు. దీనికి తోడు బాలుడిని చూసి.. అయ్యో.. అతడి స్థితి జీవితాంతం అంతే అన్న ఇరుగుపొరుగు వారి మాటలు ఆ తల్లిదండ్రులను మరింత కుంగదీశాయి. దాని నుంచి కోలుకున్న అమ్మానాన్నలు అమృత్‌ను ఎలాగైనా ప్రయోజకుడిని చేయాలని నిశ్చయించుకున్నారు. నాటి వారి సంకల్ప ఫలితంగానే సాఫ్ట్‌వేర్‌గా ఎదిగాడు అమృత్‌.

అన్నీ తామై చూసుకొన్న తల్లిదండ్రులు: అవయవాలు పనిచేయని అమృత్‌కు అన్నీ తామై వ్యవహరించారు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు. స్థానికంగానే విద్యనభ్యసించిన యువకుడిని 5వ తరగతి వరకు తల్లి ఎత్తుకొని పాఠశాలకు తీసుకెళ్లేది. తర్వాత చక్రాల కుర్చీపై స్కూలుకెళ్లిన అమృత్‌కు తోటి విద్యార్థులు సాయం చేసేవారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా స్నేహితురాళ్లు ధరణి, రమ్య తినిపించేవారు. ఇలాంటి పరిస్థితుల మధ్య చదువుకున్న అమృత్‌ పదిలో 9.1 పాయింట్లు సాధించి మేటిగా నిలిచాడు.

విద్యా జీవితం: ఇంటర్‌లో ఎంఈసీ చదివి 940 మార్కులు సాధించాడు. డిగ్రీలో బీ.కాం ను 2021లో పూర్తి చేశాడు. ఇంటర్ పరీక్షల సమయంలో ఇంట్లో మంచం మీద నుంచి కిందకు దింపుతున్న సమయంలో అమృత్ జారి పడటంతో కాలు విరిగిపోయింది. ఐనప్పటికీ స్ట్రెచ్చర్ మీద వెళ్లి పరీక్ష రాశాడు. అధిక మార్కులతో ఉత్తీర్ణ సాధించి.. ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు అమృత్‌. శరీరంలోని అవయవాలన్నీ చచ్చుబడిపోయినా...రెండు చూపుడు వేళ్లు పనిచేయడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు.

సంకల్ప బలమే ఫలించింది: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఎదగాలనుకొని తానే సామాజిక మాధ్యమాల ద్వారా అమెజాన్‌ సంస్థ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. 3 విడతల్లో ఆ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో నెగ్గి ఏడాదికి 3 లక్షల రూపాయల కొలువు కొట్టాడు అమృత్‌. దీంతో పాటు శాశ్వతంగా ఇంటి నుంచే జాబ్‌ చేసేందుకు అవకాశం కల్పించింది అమెజాన్‌ సంస్థ.
పిల్లల అభ్యున్నతి కోసం అహర్నిషలు శ్రమిస్తారు తల్లిదండ్రులు. కానీ, దివ్యాంగుడైన కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ తల్లిదండ్రుల కృషికి ఫలితం లభించినట్లైంది. అమృత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే వారి కల సాకారం అవ్వడం పట్ల వారి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు ఐనంతమాత్రనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తే ఎందులోనైనా విజయం సాధించవచ్చంటాడు అమృత్‌. ఆలోచనలకు పదును పెడితే మేటిగా నిలవొచ్చని నిరూపించి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.