రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నా... వచ్చే మూడు నెలలు మాత్రం అత్యంత కీలకమైనవిగా వైద్యారోగ్య శాఖ చెబుతోంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి పెరగటం వల్ల వైరస్ వ్యాప్తికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని పేర్కొంటోంది.
పలు దేశాల్లో ఇప్పటికే కరోనా రెండో దశవ్యాప్తి ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వైద్యారోగ్య శాఖ జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచార వాహనాల ద్వారా కరోనా టెస్టులు నిర్వహించటం ద్వారా పాజిటివ్లను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి...
ఇదీ చూడండి: చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలంటూ రైతుల నిరాహార దీక్ష