శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి పాత భవంతిని తక్షణం ఖాళీ చేయాలని పేర్కొంటూ.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి అదేశాలు పంపింది. గత రెండు రోజులుగా ఉస్మానియా పాత భవంతి స్థానంలో కొత్త భవన నిర్మాణం చేపట్టాలని ఆసుపత్రి సిబ్బంది ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన డీఎంఈ ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేసి రోగులను ఇతర వార్డులకు తరలించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి భవంతిని సీల్ చేయడంతోపాటు ఆ ప్రాంతంలో ఎలాంటి కార్యాకలపాలు జరపకూడదని పేర్కొన్నారు. ఆదేశాలు అందిన వెంటనే ఉస్మానియాలో రోగుల తరలింపు చేపట్టాలని.. ఉస్మానియా వైద్యులు ప్రకటించారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?