ETV Bharat / state

TTD News: శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తప్పని ఎదురుచూపులు - ఏపీ వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులకు ఎదురు చూపులు తప్పడం లేదు. కరోనా దృష్ట్యా దర్శన టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భక్తుల అవసరాలను ఆసరా చేసుకున్న దళారులు మోసాలకు తెరతీస్తున్నారు. శ్రీవారి దర్శన టికెట్ల పరిమితం దృష్ట్యా అక్రమాలకు ఊతమిస్తున్న తీరుపై ప్రత్యేక కథనం

ttd troubles
తిరుమల
author img

By

Published : Nov 6, 2021, 10:01 AM IST

మొక్కులు చెల్లించుకునేవారు కోర్కెలు కోరుకునేవారు పిల్లల పుట్టు వెంట్రుకలు పుట్టినరోజు, పెళ్లిరోజులు సంవత్సరానికి ఒక్కసారైనా స్వామివారిని దర్శించునేవారు ఇలా నిత్యం కళకళలాడే తిరుమల వెంకటేశుడి సన్నిధి కరోనాతో ఒక్కసారిగా వెలవెలబోయింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో స్వామి దర్శనం సామాన్యుడికి దూరమైంది.

వందల ఏళ్ల నుంచి ఎప్పుడంటే అప్పుడు స్వామి పిలుపు రాగానే బయలుదేరి వెళ్లి ఆ ఏడుకొండలవాడిని దర్శించుకునే భక్తులకు తిరుమల కొండ ఎక్కడానికే అనుమతి లేకుండా పోయింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టి ఆంక్షలు సడలించినా స్వామి దర్శనానికి తిప్పలు తప్పడం లేదు. టికెట్‌ ఉన్నవారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. దీంతో భక్తుల అవసరాలను ఆసరా చేసుకున్న దళారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. దర్శన టికెట్ల పేరుతో మోసం చేస్తున్నారు.

శ్రీవారి దర్శన టికెట్ల పరిమితం

మోసగించేస్తున్నారు..

ఆన్‌లైన్‌లో పరిమిత సంఖ్యలో విడుదలయ్యే టిక్కెట్లను పొందలేని యాత్రికులు దళారులను ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. ఇటీవల కాలంలో నకిలీ టికెట్లు, సిఫార్సులతో భక్తులను మోసగించిన సంఘటనలు అధికమయ్యాయి. హైదరాబాద్‌, రాయచోటికి చెందిన భక్తుల నుంచి మూడు వందల రూపాయల దర్శన టిక్కెట్ల ఏడింటికి 35 వేల రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. గడచిన నాలుగు నెలల కాలంలో 75 కేసుల్లో 250 మందికి పైగా దళారులు అరెస్టు అయ్యారు.

రోజుకు 25 నుంచి 30 వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటుండగా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా 16 వేల మంది శ్రీవారిని దర్శించుకొంటున్నారు. ప్రముఖుల సిఫార్సు లేఖలు, పర్యాటక శాఖ, సేవాటిక్కెట్ల ద్వారా మరో పద్నాలుగు వేల మంది దర్శించుకుంటున్నారు. అయితే సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల సంఖ్య మరింత పెంచాలన్న డిమాండ్‌లు భక్తుల నుంచి రోజు రోజుకు అధికమవుతున్నాయి.

ఇదీ చదవండి: Podu land issue in telangana: పోడు భూములపై శాటిలైట్‌ మ్యాప్‌.. ఆ వివరాలు పక్కాగా తేల్చేందుకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.