CC Cameras Are Not Working: గతేడాది గణాంకాల ప్రకారం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో లక్షా 05వేల 97 సీసీ కెమెరాలున్నాయి. వీటిలో 4వేల 402 పనిచేయట్లేదంటూ 2022 జులై 11న సమాచార హక్కుచట్టం ద్వారా బహిర్గతమైంది. గ్రేటర్ పరిధిలో 9 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసు యంత్రాంగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రజలు, కాలనీ సంఘాలు, వ్యాపారుల సహకారంతో లక్ష్యాన్ని పూర్తిచేశారు.
కానీ! క్రమంగా సీసీ కెమెరాల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడటంతో పలుచోట్ల కెమెరాలు మసకబారుతున్నాయి. నగరాల్లో అభివృద్ధి పనుల కారణంగా తరచూ సీసీ కెమెరాల వైర్లు తెగిపోతుంటే, పలు ప్రాంతాల్లో కోతులు వాటిని కొరికేస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లోని అధికారులు గుర్తించినపుడు వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు.
హైదరాబాద్‌లో కీలకమైన ప్రాంతం జూబ్లీహిల్స్ పరిధిలో 564 కెమెరాలుంటే, కేవలం 201 మాత్రమే పని చేస్తున్నాయి. బంజారాహిల్స్‌లో 502 కెమెరాలు ఉండగా, అందులో 192, అంబర్ పేటలో 433లో 157, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 400 లకు గానూ.. 305 సీసీ కెమెరాలు పని చేయడంలేదు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 370లో 118, ముషీరాబాద్‌లో 253లో 105, నల్లకుంట పరిధిలో 239లో 121, చార్మినార్ ఏరియాలో 127లో 77, టూరిజం స్పాటైన గోల్కొండ పరిధిలోనూ 101 కెమెరాలు పని చేయట్లేదు. పాత బస్తీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సగటున వంద సీసీ కెమెరాలు రిపేర్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిఘా నేత్రాలు పనిచేయక పోవడంతో వరుస చోరీలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని ప్రజలు అందోళనలు చెందుతున్నారు.
ఇవీ చదవండి: