ETV Bharat / state

అందమైన కేకులకు కేరాఫ్ అడ్రస్ జయభార్గవి - జమభార్గవి

ఎప్పుడూ పడుకుంటునే ఉండాడు, ఎక్కువగా మేకప్ వేసుకుంటుంది, సరదాగా పేకాట ఆడుతాడు, బైకులంటే చాలా ఇష్టం, అమ్మాయి దేవకన్యలా ఉంటుంది, తను ప్రకృతి ప్రేమికురాలు... ఇలా మీ కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో, బంధువుల్లో ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వారి పుట్టిన రోజులకు స్పెషల్​గా వారి గుణగణాలకు తగ్గట్టు కేకు తయారు చేయించాలనుకుంటే హైదరాబాద్​లోని జయభార్గవి దగ్గరకు వెళ్లాల్సిందే.

అందమైన కేకులకు కేరాఫ్ అడ్రస్ జయభార్గవి
author img

By

Published : Jul 27, 2019, 5:46 PM IST

Updated : Jul 27, 2019, 8:29 PM IST

అందమైన కేకులకు కేరాఫ్ అడ్రస్ జయభార్గవి

మన అభిరుచులకు తగ్గట్టుగా... ఎలా కావాలంటే అలా నాణ్యమైన కేకులను తయారు చేస్తూ అదరహో అనిపిస్తోంది జయ భార్గవి. అంతేనా... తను నేర్చుకున్న కేకుల తయారీని వందల మందికి నేర్పిస్తోంది. శిక్షణను కేవలం హైదరాబాద్​కే పరిమితం చేయకుండా ఆన్​లైన్ ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఉన్న వారికి కూడా అందిస్తున్నారు.

ప్రకాశం జిల్లా దొర్నాల ప్రాంతానికి చెందిన క్రిష్ణ చైతన్య, జయభార్గవి దంపతులు నిజాంపేట్​లో నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఉద్యోగరిత్యా క్రిష్ణచైతన్య కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న జయభార్గవి కేకులు తయారు చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హైదరాబాద్ తిరిగొచ్చేశారు. క్రిష్ణచైతన్య సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తుంటే... జయ భార్గవి తిరిగి కేకుల తయారీ మెళకువలపై దృష్టిసారించారు. అందమైన కేకులను అధునాతనంగా తయారుచేయడంపై ఆమె పట్టుసాధించారు. నాణ్యమైన కేకులు తయారు చేస్తూ... యువతులకు కేకులు తయారీపై శిక్షణ కూడా ఇస్తున్నారు.

అమెరికా, పుణే, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్​లో యువతులకు కేకుల తయారీపై జయభార్గవి శిక్షణ ఇస్తున్నారు. అమెరికాలో ఉన్న బ్యాచ్​కు మాత్రం ఆన్​లైన్​లో శిక్షణ ఇస్తున్నారు. ఆల్మండ్, రెడ్ వెల్, చీజ్, రిచ్ చీజ్, న్యూయార్క్ చీజ్, బట్టర్ స్కాచ్, పైన్ ఆపిల్, వెనిల్లా, షుగర్​లెస్ కేకులు, పిల్లలకు బొమ్మల ఆకృతుల్లో, పుట్టిన రోజు, పెళ్లిరోజు, అన్నప్రాసన, దోతీ ఫంక్షన్​లకు ప్రత్యేకంగా కేకులు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తాము కేజీ కేకు నుంచి 12 కేజీల బరువైన కేకులను తయారు చేశామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

కేకులు కావాలనుకునే వారు ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాముల్లో ఉన్న జయయమ్మీ కేక్స్ పేజీ ద్వారా ఆన్​లైన్​లో ఆర్డర్ చేయొచ్చని చెబుతున్నారు. పది కిలోమీటర్ల పరిధిలో అయితే ఉచితంగా, అంతకంటే ఎక్కువ దూరం అయితే సేవా చార్జీలు వసూలు చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు 300లకు పైగా కేకులను తయారు చేశామని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఎలాంటి సందేహాలు వచ్చినా విసుక్కోకుండా అందరికీ అర్థమయ్యేలా జయభార్గవి వివరించి చెప్తారని శిక్షణపొందే యువతులు చెబుతున్నారు.

జయభార్గవి ఇలాగే మరిన్ని రకాల కేకులు తయారు చేస్తూ... తనకు చేతనైనంత మందికి శిక్షణనిచ్చి వారికి బాసటగా నిలవాలని కోరుకుంటోంది.

ఇవీ చూడండి: మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ

Intro:TG_ADB_32_27_SHIVA POOJA_AVB_TS10033..
వర్షాల కోసం శివ పూజ..
24 గంటలు శివలింగానికి అభిషేకం...
–--------------------------------------------------------------------------
వర్షాలు అంవృధిగా కురిసి పాడి పంటలను కాపాడాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంతత్ ధారా అభిషేకం నిర్వహించారు. పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉన్న పురాతనమైన శివాలయంలో వారునదోవుని అనుగ్రహమునకై 24 గంటలపారు వేద మంత్రోచ్ఛారణలతో అభిదేక చేపట్టారు. భక్తుల కోరికలు తీర్చే భోళాశంకరును తలపై ఉన్న గంగను భూమిపైకి వదిలి ప్రజలు , రైతులు పండించే పంటలను కాపాడాలని వేడుకున్నారు. ఆదివారంనాడు 24 గంటల పాటు ఆలయ గర్భగుడిని డిజివ్హాన్దనం చేసి ఆ దివలింగాన్ని నీటిలో ఉంచి పూజలు చేయడం జరుగుతుందని వారు పొర్కొన్నారు..
బైట్ , గడిచర్ల నాగేశ్వర్ శర్మ..

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
9390555843
Last Updated : Jul 27, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.