ETV Bharat / state

DIESEL PRICE EFFECT: రైతుకు ఆవేదన... పెరిగిన ట్రాక్టర్ల కిరాయిలు, రవాణా ఖర్చులు - డీజిల్​ ధరలు

రైతుకు ప్రతి ఒక్కటీ సమస్యగా మారింది. కూలీలు దొరక్క, రేట్లు ఎక్కువగా ఉన్నాయని యంత్రాలతో సాగుకు ప్రయత్నిస్తే, ఇప్పుడు ఆ యంత్రాల ఖర్చు భరించడమే పెద్ద సమస్యగా పరిణమించింది. ట్రాక్టర్‌ను కిరాయికి పిలవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. వానాకాలం సాగుకు సిద్ధమైన ఏ రైతును కదిలించినా ఇదే ఆవేదన. ట్రాక్టర్‌ కిరాయిలే కాదు, వీటికి అనుబంధంగా అన్ని ధరలూ పెరిగాయి.

diesel-prices-effect-on-farmers
DIESEL PRICE EFFECT: రైతుకు ఆవేదన... పెరిగిన ట్రాక్టర్ల కిరాయిలు, రవాణా ఖర్చులు
author img

By

Published : Jun 24, 2021, 7:20 AM IST

డీజిల్‌ ధర భారీగా పెరగడంతో వ్యవసాయంపై పెనుభారం పడుతోంది. ఏడాదిలో డీజిల్‌ ధర లీటర్‌పై సుమారు రూ.25 పెరిగింది. దీంతో వరి సాగుచేసే రైతుపై ఏడాదికి ఎకరాకు అదనంగా రూ.2500 నుంచి రూ.3000 వరకు ఖర్చు పెరిగింది. ఇతర ఆరుతడి పంటలు సాగు చేసే రైతు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దుక్కి దున్నడం, నాట్లు వేయడం, పంట కోయడం, గడ్డి కట్టలు కట్టడం, పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించడం ఇలా అన్నింటిపైనా డీజిల్‌ ధర పెరగిన ప్రభావం పడుతోంది.

మట్టి తోలడానికీ ఇబ్బందే

‘భూమి సారం కోసం చెరువు నుంచి పొలానికి మట్టి తోలుకొంటాం. డీజిల్‌కు పెరిగిన ధర కారణంగా మట్టి తోలడానికి కూడా ఇబ్బందిగా ఉందని వరంగల్‌ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన సంజీవరెడ్డి అనే రైతు వాపోయారు. ‘ఇంతకు ముందు ట్రాక్టర్‌కు రూ.300 తీసుకొంటే ఇప్పుడు రూ.500 అయింది. పొక్లెయిన్‌, ట్రాక్టర్‌ రెండింటి ఖర్చులూ పెరిగాయి. పశువుల ఎరువు తోలడానికి ట్రిప్పుకు ట్రాక్టర్‌కు రూ.500 నుంచి రూ.800కు పెంచారు. ఇలా ప్రతి ఒక్కటీ భారంగా మారింద’ని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రాక్టర్ల నిర్వహణా భారమే..

గత ఏడాది ఏడు లీటర్ల ఇంజిన్‌ ఆయిల్‌, ఫిల్టర్‌ మార్చి సర్వీసింగ్‌ చేయడానికి రూ.2300 తీసుకొనేవారు. ఇప్పుడు రూ.4500 అయింది. అన్నీ పెరిగాయి. ట్రాక్టర్ల క్లచ్‌ప్లేట్ల ధర రూ.17 వేల నుంచి రూ.18 వేలు ఉండేది. ఇప్పుడు రూ.23 వేలు. యంత్రాల నిర్వహణ భారం కావడంతో చాలా మంది వాటిని పక్కన పడేయడమో లేదా అమ్మకానికి పెట్టడమో చేస్తున్నారని నల్గొండ జిల్లా చెరువు అన్నారం గ్రామానికి చెందిన ఓ రైతు వివరించారు. కౌలుకు చేసే వాళ్ల పరిస్థితి మరీ దయనీయమని మరో రైతు పేర్కొన్నారు.

గత సంవత్సరం-ఇప్పుడు

రైతుబంధు సొమ్ము దానికే సరి

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఇస్తున్న మొత్తం కొంత ఆదుకుంటోంది. కేంద్రం కూడా రైతులకు ఏడాదికి రూ.ఆరువేలు ఇస్తోంది. అయితే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వాలు ఇచ్చే మొత్తంలో ఎక్కువ భాగం ఈ అదనపు ఖర్చుకే సరిపోతోందని పలువురు రైతులు పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చేది కూడా కొందరికేనని వారంటున్నారు.

రాయితీలు అందడం లేదు..

ప్రస్తుతం సబ్సిడీలపై విత్తనం సహా ఏమీ రైతుకు అందడం లేదని, ఇది కూడా ఈ ఏడాది అదనపు భారమని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామానికి చెందిన అనంత రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరి విత్తనానికి సబ్సిడీ లేకపోవడంతో బ్యాగుపైన రూ.150 అదనపు భారం పడింది. 20 సంచులు తెస్తే ఈ సీజన్‌కే రూ.మూడువేలు అదనం. మోటార్లు మొదలుకొని యంత్రాల వరకు సబ్సిడీలు ఏమీలేవు. మట్టిని చదును చేసే రోటా మోటార్‌ ధర రెండేళ్ల క్రితం రూ.లక్ష ఉంటే, రూ.30 వేలు సబ్సిడీ పోగా రూ.70 వేలకు వచ్చేది. ఇప్పుడు ఈ సబ్సిడీలు లేవు. దున్నడం కోసం ట్రాక్టర్‌కు బిగించే సామాన్లనూ సబ్సిడీతో ఇచ్చేవారు. దానినీ ఎత్తేశారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంతకంటే దిగజారకుంటే చాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ పెరిగిన భారం చూస్తుంటే రెట్టింపేమో కానీ ఇంతకంటే ఇంకా దిగజారకుంటే చాలని ఆదిలాబాద్‌ జిల్లా అనుకుంట గ్రామానికి చెందిన దత్తాత్రి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా దున్నడానికి గత ఏడాది ట్రాక్టర్‌ కిరాయి రూ.800 ఉంటే ఇప్పుడు రూ.1200 అయ్యింది. పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్లడానికి ట్రాక్టర్‌ కిరాయి రూ.వెయ్యి అదనంగా పెరిగింది. కందులు మార్పిడి చేయడానికి అదనంగా రూ.ఐదువేల ఖర్చు వస్తుంది. దుక్కి మొదలుకొని మార్కెట్‌ వరకు అన్నీ కలుపుకొని ఏడాదిలో రూ.35 వేలకు పైగా అదనపు ఖర్చు వచ్చింది. ఇక నా ఆదాయం రెట్టింపయ్యేది ఎప్పుడ’ని ఆయన ప్రశ్నించారు. ఎక్కువమంది రైతులది ఇదే పరిస్థితి.

బెంబేలెత్తిస్తున్న పెట్రోలు ధర

డీజిల్‌ ధరే కాదు పెరిగిన పెట్రోలు ధర కూడా రైతుకు భారంగా మారింది. విత్తనాలు, క్రిమి సంహారక మందులు సహా ప్రతి చిన్నపనికీ సమీపంలో ఉన్న మండల కేంద్రానికో, పట్టణానికో ద్విచక్ర వాహనంపై వెళ్తారు. పెట్రోలు ధర అడ్డగోలుగా పెరగడం వల్ల ద్విచక్రవాహనంపై తిరగడం కూడా కష్టంగా ఉందని జగిత్యాల మండలం చల్‌గల్‌ గ్రామానికి చెందిన బండెల మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాదిలో రూ.2 వేల కోట్ల భారం

గత ఏడాది వానాకాలంలో తెలంగాణలో కోటి 35 లక్షల 63 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో వరి 53.33 లక్షల ఎకరాల్లో, పత్తి 60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో కంది, మొక్కజొన్న, సోయాబీన్‌ తదితర పంటలు వేశారు. ఈ వానాకాలంలో కోటీ 40 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా, పత్తి సాగు పెంచి వరిని కొంత తగ్గించడానికి వ్యవసాయశాఖ ప్రయత్నిస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసినా, డీజిల్‌ ధర కారణంగా రైతులపై రూ.1250 కోట్ల భారం పడుతుంది. మిగిలిన ఆరుతడి పంటలకు ఎకరాకు సరాసరి రూ.వెయ్యి ఖర్చు పెరిగినా రూ.900 కోట్లు అదనపు భారం. అంటే మొత్తంమీద ఈ ఒక్క సీజన్‌లోనే రూ.రెండువేల కోట్లకు పైగా రైతులు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. యాసంగి కూడా కలిపితే ఇంకెంత పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రతి ఒక్కటీ భారమే..

  • వరి సాగుచేసే రైతుపై ఏడాదికి ఎకరాకు రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు ఖర్చు పెరిగింది. ఇతర ఆరుతడి పంటలు సాగు చేసే రైతు రూ. 1,000 నుంచి రూ. 1500 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
  • పంట కోసే మిషన్‌కు గంటకు రూ.1700 నుంచి రూ.1800 తీసుకొనేవారు. ఇప్పుడది రూ.2300 అయ్యింది.
  • వరి విత్తనానికి సబ్సిడీ లేకపోవడంతో బ్యాగుపై రూ.150 అదనపు భారం పడింది.
  • మట్టి తోలడానికి ఇంతకు ముందు ట్రాక్టర్‌కు రూ.300 తీసుకొంటే ఇప్పుడు రూ.500 అయింది.
  • ట్రాక్టర్‌ బ్లేడ్లతో పొలం గట్టు పటిష్ఠం చేయడానికి ఖర్చు రూ.600 నుంచి రూ.800 పెరిగింది.
  • గత ఏడాది ఏడు లీటర్ల ఇంజిన్‌ ఆయిల్‌, ఫిల్టర్‌ మార్చి సర్వీసింగ్‌ చేయడానికి రూ.2,300 తీసుకొనేవారు. ఇప్పుడు రూ.4,500 అయింది.

ఎకరా దున్నడానికి ట్రాక్టర్‌ ఖర్చు రూ. 4 వేలు అయ్యేది. ఇప్పుడు రూ.6 వేలు అయ్యింది. కూలీలు సగంమంది స్థానికంగా లభిస్తే, మిగిలిన వాళ్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తాం. ఎకరాకు 12 మంది వచ్చి పని చేసేలా మాట్లాడుకుంటాం. డీజిల్‌ ధర పెరిగిందని ఒక్కొక్కరికి రూ.50 పెంచారు. పంట కోసే మిషన్‌కు గంటకు రూ.1700 నుంచి రూ.1800 తీసుకొనేవారు. ఇప్పుడది రూ.2300 అయ్యింది. 4 ఎకరాలకు ఆరుగంటలు పడుతుంది. పండిన ధాన్యాన్ని నర్సంపేటకు తీసుకెళ్తాం. ఇంతకు ముందు ట్రాక్టర్‌కు రూ. 800 నుంచి రూ.వెయ్యి తీసుకొనేవారు. ఇప్పుడు రూ. 1500 అయ్యింది. ట్రాక్టర్‌తో విత్తనం వేస్తే ఎకరాకు రూ. 1500 తీసుకొనేవారు. అది ఇప్పుడు రూ. 2500 అయ్యింది. పశువులకు ట్రాక్టర్‌ గడ్డి తోలితే రూ.800 దాకా అయ్యేది, అది ఇప్పుడు రూ.1500 అయ్యింది. పురుగుమందులు సహా అన్నింటి ధరలూ పెరిగాయి. రైతుకు ప్రతి ఒక్కటీ భారమే.

- మొగిలి, తిమ్మంపేట, దుగ్గొండి మండలం, వరంగల్‌ గ్రామీణ జిల్లా

పీవీసీ పైపుల ధరలూ పెరిగాయి

పోయిన సంవత్సరం డీజిల్‌ డ్రమ్ము రూ.1500కు వస్తే ఇప్పుడు రూ. 1900 అయ్యింది. వరికోసే యంత్రానికి గంటకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా పెరిగింది. ట్రాక్టర్‌ నిర్వహణ ఖర్చు చాలా పెరిగింది. రూ.8 ఉండే బోల్టు ఇప్పుడు రూ.11 అయ్యింది. రైతులకు పీవీసీ పైపులు అవసరమవుతాయి. గత సంవత్సరం ఒక్కో పైపు రూ. 820తో వంద పైపులు కొన్నా. ఈ సంవత్సరం పది పైపులు ఒక్కొక్కటి రూ. 1,450తో కొనాల్సి వచ్చింది. ఇంత ఎందుకు పెరిగిందంటే వీటి తయారీకి పెట్రో ఉత్పత్తులు అవసరమవుతాయి, వాటి ధరలు పెరగడం వల్ల పీవీసీ పైపుల ధరలు పెరిగాయని కంపెనీ వాళ్లు చెప్తున్నారు. బావులు, బోర్లమీద ఆధారపడిన వాళ్లంతా పైపులు కొనాల్సిందే. పైపులే కాదు వాటి ఫిట్టింగ్స్‌ కూడా పెరిగాయి.

-బి.రాంకిషోర్‌, కొత్తూరు, నేలకొండపల్లి, ఖమ్మం

ఇదీ చూడండి: ఏరువాక పున్నమికి శ్రీకారం చుట్టనున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.