ETV Bharat / state

డీహెచ్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు నర్సుల ధర్నా - contract nurses protest in front of dh office

హైదరాబాద్​ డీహెచ్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు నర్సులు ఆందోళనకు దిగారు. 2017లో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి... తమకు న్యాయంగా దక్కాల్సిన వెయిటేజ్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డీహెచ్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు నర్సుల ధర్నా

author img

By

Published : Feb 17, 2021, 9:58 AM IST

Updated : Feb 17, 2021, 10:08 AM IST

స్టాఫ్‌ నర్స్‌ నియామక ప్రక్రియకు సంబంధించి... కాంట్రాక్టు నర్సులు మరోసారి డీహెచ్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 2017లో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి... తమకు న్యాయంగా దక్కాల్సిన వెయిటేజ్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు నర్సులకు ప్రత్యేక వెయిటేజీ కింద 20 మార్కులు కలుపుతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు గత ఏడాది జాబితా విడుదల చేయగా... కొందరు పొరుగు సేవల ఉద్యోగులు తప్పుడు ధ్రువపత్రాలలో వెయిటేజీ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు..... ఇటీవల తాజాగా వెయిటేజీ మార్కులను జత చేసిన జాబితాను విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో నియామకాలను పూర్తి చేసేందుకు టీఎస్​పీఎస్​సీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికీ తమకు వెయిటేజీ మార్కులు రాలేదంటూ పలువురు డీహెచ్‌ కార్యాలయం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.

డీహెచ్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు నర్సుల ధర్నా

ఇదీ చూడండి: కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ

Last Updated : Feb 17, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.