ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్​

రాష్ట్ర రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం మొదలైంది. ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా 570 మండలాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్​
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్​
author img

By

Published : Nov 2, 2020, 7:10 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్​

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ జిల్లా మినహా 570 మండలాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సీఎస్​ సోమేశ్‌ కుమార్‌ ధరణి సేవలను పరిశీలించారు. గత నెల 29న సీఎం కేసీఆర్​ పోర్టల్‌ను ప్రారంభించారు.

త్వరలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు

ఇప్పటివరకు లక్షా 48 వేల ఎకరాలకు సంబంధించి 59 లక్షల 46 వేల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయ‌ని సీఎస్​ తెలిపారు. ఇకపై ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ కొన‌సాగుతుంద‌న్నారు. తొలినాళ్లలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు ఎదుర్కొనేందుకు నిపుణుల బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తొలుత నాలుగు రకాల సేవలు ప్రారంభించామని... త్వరలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని సోమేశ్​కుమార్​ వెల్లడించారు.

పావుగంటకే పాస్​బుక్​

జిల్లాల్లో కలెక్టర్లు, తహసీల్దార్లు ధరణి సేవలు ప్రారంభించారు. తొలిరోజు 946 మంది రిజిస్ట్రేష‌న్ల కోసం న‌గ‌దు చెల్లించారని... 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నార‌ని సీఎస్​ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. స్లాట్లు బుక్‌ చేసుకున్నవారు తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. కేవలం 15 నిమిషాల్లోనే రైతులకు అధికారులు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సేవలందుతాయని అధికారులు పేర్కొన్నారు. 15 నిమిషాల్లోనే పాస్‌బుక్‌ అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నిక కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: సిద్దిపేట సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.