ETV Bharat / state

DH Srinivas rao: 'కరోనా ఇంకా పోలేదు.. ఈ 3 నెలలు జాగ్రత్తలు అవసరం' - కరోనాపై ప్రజలకు డీహెచ్​ అవగాహన

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సీజనల్​ వ్యాధులు ప్రబలతున్నాయని డీహెచ్​ శ్రీనివాసరావు హెచ్చరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం లేదా, కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్​ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, పండుగలు, విందులు, షాపింగ్​ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల్లో పండుగలు చేసుకోవాలని డీహెచ్​.. మీడియా సమావేశంలో వెల్లడించారు.

dh srinivas rao
డీహెచ్​ శ్రీనివాస రావు
author img

By

Published : Oct 11, 2021, 3:48 PM IST

రానున్న మూడు నెలలు పండుగల సీజన్‌ కావడం వల్ల ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 33 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్​(RTPCR) ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కొవిడ్‌ రికవరీ రేటు 99 శాతం ఉందని.. ఇన్‌ఫెక్టివిటీ రేటు 0.4 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. కరోనా మరణాలు అతితక్కువగానే నమోదవుతున్నాయని శ్రీనివాసరావు వివరించారు.

కొవిడ్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని.. ఈ మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని డీహెచ్​ సూచించారు. మహమ్మారిపై పూర్తిగా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.01 కోట్ల మందికి కనీసం ఒక డోసు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చామని శ్రీనివాసరావు వెల్లడించారు. 38 శాతం మందికి రెండో డోసు ఇచ్చామని తెలిపిన డీహెచ్.. రెండు డోసులు తీసుకుంటేనే సురక్షితమని స్పష్టం చేశారు.

గత 3 నెలల నుంచి రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా తీవ్రత, మూడో దశను అడ్డుకున్నాం. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశాం. దాదాపు కరోనా ముందు పరిస్థితులు కనిపించడంతో పాటు.. సాధారణ జీవనంలోకి వస్తున్నాం. ఇప్పటివరకు కరోనా సోకని వారు జాగ్రత్తగా ఉండాలి. డిసెంబరు వరకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొవిడ్ కాదని తేలాకే మిగిలిన వ్యాధులకు చికిత్స తీసుకోవాలి. -శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి: డీహెచ్

ఇదీ చదవండి: Harish rao campaign: హుజూరాబాద్​లో దూసుకెళుతున్న కారు.. ఆకట్టుకుంటున్న హరీశ్ ప్రచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.