ETV Bharat / technology

యాపిల్ లవర్స్​కు షాక్- చాలా దేశాల్లో ఈ 3 ఐఫోన్ల విక్రయాలు బంద్!- ఎందుకో తెలుసా? - APPLE STOPS SELLING 3 IPHONE MODELS

ఐఫోన్ 14తో సహా 3 మోడల్స్ మార్కెట్ నుంచి మాయం!- కారణం ఇదే!

Apple Stops Selling 3 iPhone Models
Apple Stops Selling 3 iPhone Models (Photo Credit: File Photo)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 29, 2024, 1:19 PM IST

Updated : Dec 29, 2024, 1:24 PM IST

Apple Stops Selling 3 iPhone Models: టెక్ దిగ్గజం యాపిల్ ఐరోపా యూనియన్ దేశాలలో తన మూడు ఐఫోన్ మోడళ్ల విక్రయాలను నిలిపివేసింది. 'ఐఫోన్ 14', 'ఐఫోన్ 14 ప్లస్', 'ఐఫోన్ SE (3rd Gen)' మోడల్స్​ను చాలా యూరోపియన్ దేశాలల్లోని తన ఆన్​లైన్ స్టోర్ల నుంచి తొలగించింది. ఇప్పుడు ఇవి ఆఫ్​లైన్​ స్టోర్లలలో కూడా అమ్మకానికి అందుబాటులో లేవు. యూరోపియన్ యూనియన్ (EU) నిబంధనల కారణంగానే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

కారణం ఇదే!: 2022 సంవత్సరంలో EU తన మొత్తం 27 దేశాలలో విక్రయానికి అందుబాటులో ఉండే ఫోన్‌లు, కొన్ని ఇతర గాడ్జెట్‌లు తప్పనిసరిగా USB-C పోర్ట్‌ను కలిగి ఉండాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదట్లో యాపిల్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో ప్రస్తుతం 'ఐఫోన్ 14', 'ఐఫోన్ 14 ప్లస్', 'ఐఫోన్ SE (3rd Gen)' ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్‌ను కలిగి లేనందున కంపెనీ వీటిని నిలిపివేయాల్సి వచ్చింది.

యాపిల్ గత వారం రోజులుగా తన పాత స్టాక్‌ను స్టాక్‌ను క్లియర్ చేసే పనిలో పడింది. ఇప్పటివరకు ఇది ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్​తో పాటు అనేక ఇతర దేశాలలోని తన స్టోర్స్ నుంచి ఈ ప్రొడక్ట్​లను తొలగించింది. స్విట్జర్లాండ్‌లో కూడా ఈ మూడు మోడల్ ఐఫోన్ల విక్రయాలు నిలిచిపోయాయి. స్విట్జర్లాండ్ ఐరోపాలో భాగం కానప్పటికీ ఆ దేశంలోని చాలా వరకు నిబంధనలు.. యూరోపియన్ యూనియన్ చట్టాలను పోలి ఉంటాయి. అలాగే ఈ మోడల్ ఐఫోన్‌లను ఇకపై ఉత్తర ఐర్లాండ్‌లో కూడా కొనుగోలు చేయలేరు.

ఇకపోతే వచ్చే ఏడాది మార్చిలో యాపిల్ 'ఐఫోన్ SE (4th generation)' USB-C పోర్ట్‌తో రిలీజ్ కావచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఐఫోన్ త్వరలో యూరప్‌లో కూడా తిరిగి రావొచ్చు.

మార్బుల్ ఫినిష్​తో లావా కొత్త 5G ఫోన్- కేవలం రూ.9,499లకే!- ఇంటివద్దే ఫ్రీ సర్వీస్ కూడా!

'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!

అత్యాధునిక ఫీచర్లతో 2025 హోండా యూనికార్న్- ధర కూడా పెరిగిందిగా!- ఇప్పుడెంతంటే?

వాట్సాప్​లో మీకు బ్లూ కలర్ సర్కిల్ కన్పిస్తుందా?- దీని ఉపయోగాలు తెలిస్తే షాకే!- ఎలా వాడాలంటే?

Last Updated : Dec 29, 2024, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.