ETV Bharat / state

10 రోజులకు మించి దరఖాస్తులు ఆగకూడదు! - తొక్కిపెడితే అధికారులపై చర్యలు తప్పవు!! - TAKING BRIBE APPLICATION APPROVAL

భవన నిర్మాణ అనుమతులకు అధికారుల లంచాలు - పనుల్లో జాప్యం - ప్రణాళిక విభాగంపై దృష్టి పెట్టిన హెచ్‌ఏండీఏ

Officials Taking Huge Bribes For House Application Approvals
Officials Taking Huge Bribes For House Application Approvals (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 1:00 PM IST

Updated : Dec 29, 2024, 3:39 PM IST

Officials Taking Huge Bribes For House Application Approvals : మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతులు కావాలంటే కాళ్లు అరగాల్సిందే. దీనికితోడు కింది నుంచి పైవరకు అన్ని స్థాయిల్లో ముడుపులు చెల్లించుకుంటే తప్ప దరఖాస్తు ముందుకు జరగదు. ఇది బహిరంగ రహస్యం. కొందరైతే ఫ్లోర్‌కు రూ.లక్ష ఇవ్వనిదే అప్లికేషన్‌ ముఖంక కూడా చూడరనే ఆరోపణలు ఉన్నాయి. ఇక లేఅవుట్లు అనుమతుల్లోనూ ఇదే తతంగం నడుస్తోంది. ఈ ప్రభావం దరఖాస్తుల పరిష్కారంపై పడుతోంది. దీంతో ఉన్నతాధికారులు ప్రణాళికా విభాగంపై ప్రత్యేక దృష్టి సారించారు.

వారిపై క్రమశిక్షణ చర్యలు : ప్రతి అధికారి దగ్గర పది రోజుల కంటే ఎక్కువ రోజులు దరఖాస్తు ఆగడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంమీద ఒక దరఖాస్తు ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి కావాలి. సిబ్బంది కొరత, ఇతరత్రా పలు కారణాలు చూపుతూ 3-4 నెలలు అంతకంటే ఎక్కువ సమయమే తీసుకుని దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. ఈ కారణాల ప్రభావం స్థిరాస్తి మార్కెట్‌పై పడుతోంది. ఈ నేపథ్యంలో ఏ అధికారి తన వద్ద 10 రోజులకు మించి జాప్యం చేయకూడదనే నిబంధనతో ప్రస్తుతం అనుమతుల్లో వేగం పెరిగిందని తాజాగా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు ఉద్దేశ పూర్వకంగా దరఖాస్తులను తొక్కిపెడితే వారిపై క్రమశిక్షణ చర్యలకు ఉన్నాతాధికారులు సిద్ధమవుతున్నారు.

అదంతా అవి'నీటి' సొమ్మేనా? - లేక ఎవరికైనా బినామీగా ఉన్నాడా?

  • భవనాల అనుమతులకు సంబంధించి గతేడాది జులై నుంచి నవంబరు వరకు 759 దరఖాస్తులు రాగా ఈ ఏడాది అదే సమయానికి వాటిక సంఖ్య1,061కు చేరింది. దాదాపు 40శాతం వృద్ధి నమోద కాగా గతంతో పోల్చితే 18శాతం ఎక్కువగా దరఖాస్తులను క్లియర్‌ చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
  • భవనాల ఆక్యుపేన్సీ దరఖాస్తులకు సంబంధించి 2023 జూలై నుంచి నవంబరు వరకు 467 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంవత్సరం ఆ సంఖ్య 560కు పెరిగింది. ఆరు నెలల్లో 20శాతం అధికంగా ఆమెదం తెలిపారు. క్రితం సంవత్సరంతో పోల్చితే 18 శాతం అదనంగా పరిష్కరించారు.
  • హెచ్‌ఎండీఏ పరిధిలో లేఅవుట్లకు సంబంధించి గతేడాది చివరి ఆరు నెలల్లో 103 దరఖాస్తులు రాగా ఈ ఏడాది ఆఖరి 6 నెలల్లో 299 లేఅవుట్లకు అనుమతులిచ్చారు. దాదాపు 190 శాతం దరఖాస్తులు పెరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 87 శాతం అదనంగా క్లియర్‌ చేసినట్లు పేర్కొన్నారు.

స్టేషన్‌ బెయిల్‌ పేరిట దందా.. సుప్రీం తీర్పును ఆసరాగా చేసుకొని మరీ..

రూ.కోటి ఇవ్వు లేదా రెండు ఫ్లాట్లైనా పర్లేదు - లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికిన సస్పెండైన సీఐ - SUSPENDED CI TAKES BRIBE IN HYD

Last Updated : Dec 29, 2024, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.