ధనిక, పేద తేడా లేకుండా రాజ్యాంగబద్ధంగా... సమాన సేవలు అందించాలని పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. స్వీయ నియంత్రణ అనేది పోలీసులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణమన్నారు. ఉద్యోగరీత్యా పోలీసులకు లభించిన అధికారాలను సామాన్య ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాలని మహేందర్ రెడ్డి సూచించారు. రోజులో 24 గంటలు పనిచేసే పోలీసులు... ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా ఆదర్శంగా ఉండాలని డీజీపీ పేర్కొన్నారు.
పోలీసు అకాడమీలో 335 మంది శిక్షణా సబ్ఇన్స్పెక్టర్లు, ఏఎస్సైలకు బేసిక్ ట్రైనింగ్‌ను డీజీపీ ప్రారంభించారు. దేశంలోనే పోలీస్ శిక్షణలో అత్యున్నత సంస్థ అయిన పోలీస్ అకాడమీలో శిక్షణ పొందడం గొప్ప విషయమని మహేందర్ రెడ్డి అన్నారు.
ఇవీచూడండి: తెలంగాణ కుంభమేళాకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?