ETV Bharat / state

అంతర్జాలంలో హైటెక్ వ్యభిచారానికి అడ్డుకట్ట వేస్తాం: డీజీపీ - మానవ అక్రమ రవాణా

మానవ అక్రమ రవాణా నివారణకు కఠినమైన చర్యలు తీసుకునే అంశంపై దృష్టి పెట్టాలని పోలీసులు డీజీపీ మహేందర్​రెడ్డి సూచించారు. హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణాపై రాష్ట్ర స్థాయి సదస్సు
author img

By

Published : Sep 18, 2019, 4:58 PM IST

సంపాదనే ధ్యేయంగా కొందరు వ్యక్తులు మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారని.. అలాంటి వారు ఆస్తులు జప్తు చేసి.. వారిని ఆర్థికంగా దెబ్బ తీయాలని డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. మానవ అక్రమ రవాణాపై హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. డీజీపీ మహేందర్​రెడ్డితో పాటు దీని నివారణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణాను హేయమైన చర్యగా డీజీపీ పేర్కొన్నారు. పేదరికాన్ని ఆసరాగా తీసుకుని.. మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారని చెప్పారు. అంతర్జాలంలో జరుగుతున్న హైటెక్​ వ్యభిచారానికీ అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మానవ అక్రమ రవాణాపై రాష్ట్ర స్థాయి సదస్సు

ఇదీ చదవండిః 'ప్రజ్వల'కు నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఉపరాష్ట్రపతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.