ETV Bharat / state

Devotional day in Telangana : దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు 'ఆధ్యాత్మిక దినోత్సవం'

Telangana Decade celebrations 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలను అలంకరించడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరపనున్నారు. దేవాలయాల్లో వేదపారాయణం, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 21, 2023, 8:12 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆధ్యాత్మిక దినోత్సవం

Telangana Devotional day Today : రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొత్తగా 2,043 ఆల‌యాల‌కు ధూపదీప నైవేద్య ప‌థ‌కం అమ‌లుకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. యాదాద్రిలో మిల్లెట్ ప్రసాద సేవ‌ల‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆధ్యాత్మిక చింతన క‌లిగిన‌ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం సంప్రదాయాలు, ఆలయాలు, పండుగలు, వేడుకలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని వివరించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం నేపథ్యంలో దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ రంగంలో రాష్ట్ర పురోగతిని వివరించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మ‌న పండుగ‌ల‌ు, వేడుక‌ల‌కు ప్రపంచ ఖ్యాతి లభించిందని అన్నారు. అన్ని రంగాల‌తో పాటు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో సీఎం కేసీఆర్ ఆల‌యాల అభివృద్ధికి తోడ్పడ్డారని మంత్రి అన్నారు.

Telangana Decade celebrations 2023 : ల‌క్ష్మీ న‌ర్సింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట ఆలయం దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒక్కటిగా రూపుదిద్దడం అందరికీ గర్వకారణమని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. ద‌క్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజ‌రాజేశ్వర స్వామి ఆల‌యం, కొండ‌గ‌ట్టు అంజ‌నేయ స్వామి, భద్రాద్రి రాములోరి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాల‌యం, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాల‌యం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాల‌యాల‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తుననట్లు తెలిపారు.

Indrakaran Reddy on Devotional Day : దేవాలయాల జీర్ణోద్ధరణతో ధార్మిక కార్యక్రమాలు విస్తర‌ణ‌లో భాగంగా కామ‌న్ గుడ్ ఫండ్ నిధుల‌తో రాష్ట్రంలోని అనేక ఆల‌యాల‌ను అభివృద్ధి చేసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేవాల‌యాల అభివృద్దితో పాటు ఆల‌యాల నిర్వహణ ముఖ్యమని భావించి.. అర్చకులు, ఆల‌య సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేత‌నాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆల‌య‌ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి పాలనలో అన్యాక్రాంత‌మైన ఆరువేల ఎక‌రాల ఆల‌య భూముల‌ను న్యాయపోరాటం చేసి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Telangana State Festival : దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగ‌గా ప్రకటించి ఘనంగా నిర్వహించుకుంటున్నామని, జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. బోనాల పండగ‌, భ‌ద్రాద్రి సీతారామ‌చంద్ర స్వామివారి క‌ల్యాణోత్సవం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు గోదావ‌రి, కృష్ణ, తుంగ‌భ‌ధ్ర పుష్కరాలను విజ‌య‌వంతంగా నిర్వహించినట్లు చెప్పారు.

Good Governance Day in Decade Celebrations : నేడు రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనా దినోత్సవ కార్యక్రమాలు

Telangana Introduced Online Services in Temples : భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంతో పాటు వారి సౌక‌ర్యార్ధం 20 ప్రధాన ఆల‌యాల్లో ఆన్ లైన్​లో పూజలు, వ‌స‌తి బుకింగ్, ప్రసాదం పంపిణీ, త‌దిత‌ర‌ ఆన్‌లైన్ సేవ‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ ఆలయాల నుంచి భక్తుల ఇంటికే ప్రసాదాలను పంపేందుకు పోస్టల్ శాఖ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. భ‌ద్రాద్రి రాములోరి త‌లంబ్రాల‌ను భక్తుల ఇంటికి చేర్చేందుకు కొరియ‌ర్ సేవ‌ల‌ు, మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదాన్ని జాత‌ర స‌మ‌యంలో నేరుగా ఇంటికే పంపించే సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.