Dress Code in Mahanandi Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రమైన నంద్యాల జిల్లా మహానందిని దర్శించుకునే భక్తులు ఇకపై సాంప్రదాయ దుస్తులను ధరించడం తప్పనిసరి. పురుషులు పంచా, పైజామా.. ఆడవారు చీర, పంజాబీ డ్రెస్‌ను ధరించాలి. ఆలయ ఆవరణలో రుద్రగుండం కోనేరులో పుణ్య స్నానాలు చేసేవారు ఇవే దుస్తులు ధరించాలి.
2023 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఆలయ చైర్మన్ మహేశ్వర రెడ్డి, కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్.. మహానంది దేవస్థానం కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.
ఇవీ చదవండి: