Crowd in Tirumala: శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతం కావడంతో.. కలియుగ దైవం దర్శన టోకెన్ల కోసం బారులు తీరారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు రద్దీగా మారాయి. క్యూలైన్లు నిండిపోయాయి. రేపటి దర్శనం కోసం ఇచ్చే టికెట్లకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో భక్తులు అధికసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. వాహనాల తనిఖీ ఆలస్యం కావడంతో... భక్తులకు నిరీక్షణ తప్పడం లేదు.
అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి. మరోవైపు తిరుమల శ్రీవారి పాదాల దారిలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును-టెంపో వాహనం ఢీకొనడంతో కర్ణాటకకు చెందిన భక్తులకు స్వల్పగాయాలయ్యాయి.
ఇదీ చూడండి: విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్న యాదాద్రి