తిరుమలలో శ్రీవారి దర్శనానికి రద్దీ పెరిగింది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. గురువారం 74వేల 438మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34వేల 584మంది తలనీలాలు సమర్పించారు.
భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీవారి హుండి ఆదాయం భారీగా నమోదైంది. పరకామణి లెక్కల్లో 8.58 కోట్లగా అధికారులు చేర్చారు. బుధవారం భక్తులు సమర్పించిన కానులను పరకామణిలో లెక్కించగా 3.43 కోట్ల రూపాయలు వచ్చింది. 2 సవత్సరాల నుంచి నిల్వ ఉన్న 205 కోట్ల చిల్లర నాణేలలో గురువారం 5.15 కోట్ల నాణేలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో ఒకేరోజు పరకామణి లెక్కలలో భారీగా హుండీ ఆదాయం చేరింది.