హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనంలో ఓ మండప నిర్వాహకులు ఏకరూప దుస్తులు ధరించి శోభా యాత్రలో భక్తులను ఆకట్టుకున్నారు. ఎరుపు, పసుపు, నీలం, కాషాయ, తెలుపు రంగుల్లోని కుర్తాలు ధరించి సందడి చేశారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఏకరూప దుస్తులు ధరించి మరింత శోభ తీసుకువచ్చారు. కొందరు తలకు పగిడీలు ధరించి చూడముచ్చటగా కనిపించారు.
మండప నిర్వాహకులు మాత్రమే కాదు శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన భక్తులు కూడా ఏకరూప దుస్తులు ధరించి రావడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఏకరూప దుస్తులు ధరించి నిమజ్జనంలో ప్రత్యేక ఆర్షణగా నిలిచారు.
ఇదీ చదవండి: Laddu: గచ్చిబౌలి గణేశ్ లడ్డూకి రికార్డు రేట్... ఎన్ని లక్షలంటే?