ఏపీ సరిహద్దు రాష్ట్రం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నాచికుప్పం వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆడి క్రుత్తిక ఉత్సవాల్లో అపశృతి జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శరీరానికి శూలాలు గుచ్చుకుని క్రేన్‌కు వేలాడుతూ భక్తులు కావడి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇదే క్రమంలో నలుగురు భక్తులు క్రేన్‌పై వేలాడుతుండగా అందులో ఓ భక్తుడు జారి కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న సహచర భక్తులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.
ఇవీ చదవండి:
MURDER: కోడలితో వివాహేతర సంబంధం.. కుమారుడిని చంపిన తండ్రి!
SI RAPE ATTEMPT: ఎస్సై శ్రీనివాసరెడ్డిపై మహిళా ట్రైనీ ఎస్సై ఫిర్యాదు