ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల అంతిమయాత్ర పూర్తయింది. బంజారాహిల్స్‌లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య కుమారుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు. దేవదాస్ కనకాల మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు తెలిపారు. కడసారి చూపు కోసం సీనీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఇవీ చూడండి: షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు