ETV Bharat / state

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​: మొక్కలు నాటిన డిప్యూటీ స్పీకర్​ తనయుడు - రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా తన నివాసంలో డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ తనయుడు రామేశ్వర్​ గౌడ్​ మొక్కలు నాటారు. ఈ హరితయజ్ఞంలో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందన్నారు.

deputy speaker son participated in green india challenge
గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ స్పీకర్​ తనయుడు
author img

By

Published : Aug 17, 2020, 5:16 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా సికింద్రాబాద్​లోని తన నివాసంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ హరితయజ్ఞం రూపంలో మళ్లీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను ఎంపీ సంతోష్ కుమార్ ఒక్కరితో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారని రామేశ్వర్ గౌడ్ అన్నారు. సీడ్​ గణేష్​ కార్యక్రమంలో భాగంగా జీహెచ్​ఎంసీ సిబ్బంది గణేష్​ ప్రతిమను రామేశ్వర్​ గౌడ్​కు అందించారు.

ఎంపీ సంతోష్​కుమార్​ విసిరిన ఛాలెంజ్​ను స్వీకరిస్తూ మొక్కలు నాటానని రామేశ్వర్ గౌడ్ తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం సామాజిక మాధ్యమ వేదిక ద్వారా మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతానని రామేశ్వర్ గౌడ్ చెప్పారు.

ఇవీ చూడండి: ఈ ఏడాది ఇళ్లలోనే గణేష్​ పండుగను జరుపుకోవాలి: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.