ETV Bharat / state

తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలందించడం భేష్: పద్మారావు - తెలంగాణ వార్తలు

ముగ్గురు వైద్యులు కలిసి ఓ హోమియోపతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటి స్పీకర్ పద్మారావు కొనియాడారు. తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందించడం సంతోషకరమని అన్నారు. ఈ హోమియోపతి మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

deputy-speaker-padma-rao-participated-in-as-homeo-centre-first-anniversary-celebrations-in-hyderabad
తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలందించడం భేష్: పద్మారావు
author img

By

Published : Mar 7, 2021, 1:18 PM IST

తక్కువ ఖర్చుతో మెరుగైన హోమియోపతి సేవలు అందించే ముగ్గురు వైద్యులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు అభినందించారు. అనుభవజ్ఞులైన ముగ్గురు డాక్టర్లు కలిసి ఏవీఎస్ హోమియోపతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కేంద్రం మొదటి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్​లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

హోమియోపతి వైద్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆన్​లైన్​ ద్వారా సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని వారికీ మందులు కొరియర్ చేస్తున్నామని వివరించారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని ఆఫర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ఇదీ చదవండి: కృత్రిమ అవయవాల దాత.. విధివంచితుల పాలిట వెలుగుప్రదాత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.