తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో సీఎం కేసీఆర్ పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సీఎం జన్మదినం పురస్కరించుకొని ప్రత్యేక హరితహారంలో ఆయన పాల్గొన్నారు. సీతాఫల్‌మండిలోని ముల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ పరిసరాల్లో కార్పొరేటర్లు, నేతలతో కలిసి మొక్కలు నాటారు.
కేకు కట్ చేయడంతో పాటు స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పంపిణీ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయమన్నారు. చిన్నారులు, నాయకులకు కేక్ స్వయంగా తినిపించి బెలూన్లు ఎగురవేశారు.
డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునిత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేతలు శ్రీ తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్, త్రినేత్ర గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్‌కు మోదీ, వెంకయ్య సహా పలువురి శుభాకాంక్షలు