ETV Bharat / state

'సివరేజీ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి' - డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ అధికారులతో సమీక్ష

వర్షకాలంలో కురిసే వాన నీటి సరఫరా సాఫీగా సాగేల ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ అధికారులను ఆదేశించారు. అలాగే వానాకాలంలో వచ్చే అంటు వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : Jun 3, 2020, 6:07 PM IST

వానాకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం తగిన జాగ్రత్తలు పాటించాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వర్షా కాలంలో పాటించాల్సిన జాగ్రత్తలపై బుధవారం నామాలగుండులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

నాలాల ద్వారా వరద నీటి సరఫరా సాఫీగా సాగేల ఏర్పాట్లు చేయాలని అధికారులను పద్మారావు గౌడ్​ ఆదేశించారు. మాన్సూన్ టీంల పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేస్తామని తెలిపారు. అనంతరం ఐదు మున్సిపల్ డివిజన్లకు మాన్సూన్​ అత్యవసర వాహనాలను పంపిణీ చేశారు.

సితాఫల్​మండి డివిజన్​లో పాదయాత్ర...

సికింద్రాబాద్​ నియోజకవర్గ పరిధిలో సివరేజీ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు. సితాఫల్​మండి డివిజన్​లోని చిలకలగూడలో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సివరేజీ పైప్​లైన్​ల నిర్మాణం పనులను డిప్యూటీ స్పీకర్​ ప్రారంభించారు. అనంతరం చిలకలగూడలోని కింది బస్తీ, చర్చగల్లి, పాత కల్లు కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. సమీక్షలో కార్పొరేటర్లు సామల హేమ, ఆలకుంట సరస్వతి, ధనజన బాయి గౌడ్, జీహెచ్​ఎంసీ ఉప కమిషనర్ పల్లె మోహన్ రెడ్డి, ఈఈ ప్రమోద్ కుమార్, డిప్యూటీ ఈఈ పరమేష్, స్థానిక వైద్యాధికారితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.