తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ మెట్టుగూడకి చెందిన నిశాంత్ అనే దివ్యాంగుడికి ఎలక్ట్రికల్ వీల్ చైర్‌ని అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పథకాల ద్వారా ఎంతో మంది లబ్దిదారులకు సహాయం అందిందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని.. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలని అధిరోహించాలని పద్మారావు గౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్, తీగుళ్ల కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు