తాను గెలిస్తే మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బాల ప్రశాంతి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. తెరాస పార్టీలో బాధ్యతాయుత పదవిలో ఉన్నానని ఆయన వివరించారు. ఇక మోండా మార్కెట్ ప్రాంతంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదన్నారు.
ప్రస్తుత కార్పొరేటర్ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చదువుకున్న తనకు అవకాశం కల్పిస్తే మోండామార్కెట్ డివిజన్‌ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: మీరు గెలిపించండి... కొట్లాడైనా సమస్యలు పరిష్కరిస్తా: రేవంత్