ETV Bharat / state

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ మేయర్

ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురువడంతో లోతట్టు ప్రాంతాలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పరిశీలించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తార్నాక డివిజన్​లో పర్యటించి స్థానికులకు భరోసా కల్పించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు.

డిప్యూటీ మేయర్
డిప్యూటీ మేయర్
author img

By

Published : Jun 28, 2021, 10:14 AM IST

భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురువడంతో... స్థానికులకు భరోసా కల్పించేందుకు లోతట్టు ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పర్యటించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసి అధికారులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని వెంటపెట్టుకుని తార్నాక డివిజన్​లోని మాణికేశ్వరి నగర్, సత్య నగర్, చంద్రబాబు నాయుడు నగర్, కిమిటి కాలనీ, నాగార్జున నగర్, సాయి నగర్, ప్రధాన నాలా వెంబడి పర్యటించారు.

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని, విరిగిన చెట్లను, వంగిన స్తంభాలను తొలగించి... రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. నాలా ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లల్లో ఉండరాదని కోరారు. అటువంటివి ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఇదీ చదవండి: భయం గుప్పిట్లో ముంపు బాధితులు.. పునరావాసం కోసం పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.