ETV Bharat / state

బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా హరీశ్‌రావు సమీక్ష

author img

By

Published : Mar 8, 2021, 4:43 AM IST

రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమీక్ష చేయనున్నారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో అవసరాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తారు. వార్షిక పద్దు, కేటాయింపుల విధి విధానాలను సీఎం కేసీఆర్​ ఇప్పటికే ఖరారు చేశారు.

Departmental Harish Rao Review on Budget Proposals
బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా హరీశ్‌రావు సమీక్ష

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఇవాళ్టి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం... వార్షికపద్దు, బడ్జెట్ అంచనాల కేటాయింపుల విధివిధానాలను ఖరారు చేశారు.

ఆయా శాఖలతో సమావేశాలు నిర్వహించి శాఖల వారీ ప్రతిపాదనలను సమీక్షించాలని మంత్రి హరీశ్‌రావుకు తెలిపారు. అందుకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి ఆర్థిక మంత్రి వివిధ శాఖలతో సమావేశాలు జరపనున్నారు. ఆయా శాఖల ప్రస్తుత కేటాయింపులు, ఇప్పటి వరకు చేసిన వ్యయంతోపాటు... వచ్చే ఆర్థిక ఏడాదిలో అవసరాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై హరీశ్ కసరత్తు చేస్తారు.

ఇదీ చూడండి : బడ్జెట్​లో కోతలు పెట్టినందుకు ఓట్లేయాలా?: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.