ETV Bharat / state

Dengue: భాగ్యనగరంలో మోగుతున్న డెంగీ డేంజర్ బెల్స్ - భాగ్యనగరంలో మోగుతున్న డెంగీ డేంజర్ బెల్స్

కరోనా మహామ్మారి ప్రభావం తగ్గకముందే.. తాజాగా డెంగీవ్యాధి పంజా విసురుతోంది. నగరంలో డెంగీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో 20-30 మంది వరకు ఈ వ్యాధితో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

hyderabad
డెంగీ.. తొంగిచూస్తోంది!
author img

By

Published : Aug 8, 2021, 10:28 AM IST

గ్రేటర్‌ వ్యాప్తంగా డెంగీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో 20-30 మంది వరకు ఈ వ్యాధితో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో పిల్లలు సైతం ఉంటున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం 30 మంది, గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో 25 మంది వరకు చికిత్స తీసుకుంటున్నారు.

నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి నిత్యం 300-400 మంది జ్వరంతో టెస్టుల కోసం వస్తున్నారు. ఇందులో 30-40 మలేరియా, డెంగీ కేసులు బయట పడుతున్నాయి. ఇతర అన్ని ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో చేరకుండా ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్న వారు ఎక్కువే ఉంటున్నారు. నగరంలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. డెంగీకి కారణమైన టైగర్‌ దోమ విజృంభిస్తోంది. దీని ఒంటిపై నల్లని చారలు ఉంటాయి. మంచినీటిలో పెరుగుతుంది. ఎక్కువగా పగటిపూట కుడుతుంది. దోమ కుట్టిన 3-4 రోజుల నుంచే వంటి నొప్పులతో మొదలై తీవ్ర జ్వరం, తలనొప్పి ఉంటాయి. తొలి దశ 3-5 రోజులు కొనసాగుతుంది. జ్వరం, ఒంటిపై దద్దుర్లు ఉంటాయి. రెండో దశలో ప్లేట్‌లెట్లు తగ్గడం, వాంతులు, కడుపులో నొప్పి, కాలేయంపై ప్రభావం కన్పిస్తుంది. రెండో దశలో లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఇంటివద్దే ఉంటూ వైద్యుల సూచనలతో చికిత్సలు తీసుకోవాలి. జులై నెలాఖరు నుంచి కేసులు సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వరంతో వస్తున్న ప్రతి పది మందిలో 3-4 మందిలో డెంగీ బయట పడుతోందని పేర్కొంటున్నారు. చాలామందిలో ప్లేట్‌లెట్లు తగ్గుతుండటంతో తీవ్ర ఆందోళనతో ఆసుపత్రుల బాటపడుతున్నారు. అయితే అంతమంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి తగ్గుతుందన్నారు.

dengue
-డాక్టర్‌ హితేష్‌కుమార్‌, ఎండీ ట్రాన్స్‌ఫూజియన్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌

ఎప్పుడు చేరాలంటే...

  • 2-7 రోజులపాటు జ్వరం, ఒంటిపై దద్దుర్లు, తలనొప్పి, రక్తస్రావం, కంటి వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు లక్షణాల్లో ఏవైనా రెండు అంతకంటే ఎక్కువ కన్పిస్తే డెంగీగా అనుమానించాల్సిందే.
  • వెంటనే ఎన్‌ఎస్‌1 లేదంటే డెంగీ ఐజీఎం టెస్టు చేయించుకోవాలి. వీటిలో పాజిటివ్‌ వస్తే డెంగీగా నిర్థారణ అయినట్లే. వెంటనే కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌(సీబీపీ) చేయించుకోవాలి. శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది.
  • ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్‌లెట్లు ఉంటాయి. డెంగీ వచ్చిన వారిలో ఇవి తగ్గుతాయి. 10 వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే ప్లేట్‌లెట్లు అవసరం అవుతాయి. కొందరు 50-70 వేలు ఉన్నప్పుడు కూడా ప్లేట్‌లెట్లు ఎక్కించడం సరికాదు.
  • కొవిడ్‌ నుంచి కోలుకున్న 28 రోజుల తర్వాత ప్లేట్‌లెట్లు దానం చేయవచ్ఛు ‘ఒ’ రక్తగ్రూపు డెంగీ రోగికి అదే గ్రూపుతోపాటు ఎ, బి, ఎబీ రక్తగ్రూపు ఉన్న వారు ప్లేట్‌లెట్లు దానం చేయవచ్ఛు అదే ‘ఎ’ గ్రూపు రోగికి ఎ, ఎబీ గ్రూపులు, ‘బి’ గ్రూపు రోగికి బి, ఎబీ గ్రూపులు, ఎబీ గ్రూపు రోగికి అదే గ్రూపునకు చెందిన దాతలు ప్లేట్‌లెట్లు అందించవచ్ఛు కొందరిలో ప్లేట్‌లెట్లు తగ్గుతున్నా సరే..బయటకు లక్షణాలు కన్పించవు. లోలోపల రక్తస్రావం జరిగిపోతుంది. ఎప్పటికప్పుడు సీబీపీ చేయిస్తుండాలి.

హైదరాబాద్‌ ఆరోగ్యశాఖ పరిధిలో గత మూడేళ్లలో డెంగీ కేసులు

  • 2018- 1208 డెంగీ కేసులు
  • 2019- 2494 డెంగీ కేసులు

ఇదీ చదవండి: హుజూరాబాద్​లో దళితులకేమో కోట్లు.. ఇక్కడేమో చచ్చిపోతే కనీసం పరామర్శించరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.