ETV Bharat / state

దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా: చాడ

కేంద్రం 370 రద్దుకు తీసుకొచ్చిన బిల్లు ఏపక్షంగా ఉందంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇంద్రజిత్‌ గుప్తా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

చాడ వెంకట్​రెడ్డి
author img

By

Published : Aug 25, 2019, 1:37 PM IST

దేశంలో తాజా పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ​ఇంద్రజిత్‌ గుప్తా జయంతి ఉత్సవాల్లో భాగంగా 370 రద్దు-కశ్మీర్​ పరిణామాలపై సెమినార్​కు హాజరయ్యారు. ఆర్​ఎస్​ఎస్​ కనుసన్నుల్లో మోదీ.. ప్రభుత్వాని నడుపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, రాష్ట్ర నాయకులు అజీజ్​ పాషా, పల్లా వెంకట్​ రెడ్డి పాల్గొన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా: చాడ

ఇవీ చూడండి: లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి నివాళి






దేశంలో తాజా పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ​ఇంద్రజిత్‌ గుప్తా జయంతి ఉత్సవాల్లో భాగంగా 370 రద్దు-కశ్మీర్​ పరిణామాలపై సెమినార్​కు హాజరయ్యారు. ఆర్​ఎస్​ఎస్​ కనుసన్నుల్లో మోదీ.. ప్రభుత్వాని నడుపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, రాష్ట్ర నాయకులు అజీజ్​ పాషా, పల్లా వెంకట్​ రెడ్డి పాల్గొన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా: చాడ

ఇవీ చూడండి: లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి నివాళి






Intro:JK_TG_NLG_61_25_YADADRI_MILLETS_PKG_TS10061
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రైతులు వరి, పత్తి ఎక్కువ సాగు చేస్తారు. ఈ సీజన్లో అనుకున్నంతా వర్షపాతం రానందువల్ల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మొదటి నుంచి చిరుధాన్యాలు చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న రైతులు చిరుధాన్యాల పంటలు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండడం, రైతులు కూడా వేయటానికి ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం చాలా చాలా తక్కువగా ఉంది.




Body:వాయిస్ : యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పంట సాగు విస్తీర్ణం సగానికి పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అధికారులు సూచించినట్టు గా కొంతమంది రైతులు చిరుధాన్యాల సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జొన్న పంటను 322 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రాగులను 16 హెక్టర్లు, కొర్రలు 105 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామేలు ఇతర చిరుధాన్యాలను సుమారు నలభై హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మొత్తం సాగు విస్తీర్ణంలో ఈ పంటల సాగు తక్కువ అయినప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ పంటలకు అనుకూలంగా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఈ చిరుధాన్యాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా వేసుకోవచ్చని, ఇతర పంటల సాగుకు అయ్యే ఖర్చు తో పోల్చుకుంటే చిరుధాన్యాల పంటల కు అయ్యే ఖర్చు చాలా తక్కువ అని అధికారులు చెబుతున్నారు. విత్తనాలు కూడా జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని, 50 శాతం రాయితీతో లభిస్తాయని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పంటలను చాలా వరకు మొదటి సారి వేశామని రైతులు చెబుతున్నారు. ఈ పంటల పట్ల అవగాహన ఉన్న రైతులు మాత్రం గత రెండు మూడు పంటలు చిరుధాన్యాల వేశామని ఈసారి కూడా చిరుధాన్యాల పంటను వేశామని చెబుతున్నారు. చిరుధాన్యాలు వేసిన పంట కాలంలో ఒకటి రెండు పెద్ద వర్షాలు కురిసినా పంట దిగుబడి బాగానే ఉంటుందని వారంటున్నారు. ఈసారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మూడు వేల ఐదువందల ఎకరాల్లో రైతుల చేత చిరుధాన్యాల సాగు చేయించాలి అనుకున్నప్పటికీ, రైతులు ఈ పంటల పట్ల అవగాహన లేక ముందుకు రాలేదు. చిరుధాన్యాల పంటకు చీడ-పీడలు కూడా చాలా తక్కువ , పెద్ద గా రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం కూడా లేదని అధికారులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో 90 రోజుల్లోనే అత్యధిక దిగుబడులు సాధించవచ్చని రైతులందరూ చిరుధాన్యాలు సాగు చేయాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

బైట్ : శ్రీనివాస్ (రైతు, యాదాద్రి భువనగిరి జిల్లా)

బైట్ : రాంరెడ్డి (రైతు, యాదాద్రి భువనగిరి జిల్లా )

బైట్ : అనురాధ (జిల్లా వ్యవసాయ అధికారిని, యాదాద్రి భువనగిరి జిల్లా)


reporter -satheesh
cell - 8096621425




Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.