ETV Bharat / state

వీహెచ్ దీక్షకు మద్ధతు తెలిపిన సీపీఐ నేతలు - Ambedkar statue in Panjagutta

పంజాగుట్టలో​ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్​ నేత హనుమంతరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. అంబర్​పేటలోని తన నివాసం వద్ద దీక్షకు దిగిన వీహెచ్​ను.. నేడు పలువురు నేతలు కలిశారు.​

congress leader vh protest
వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష
author img

By

Published : Apr 14, 2021, 5:14 PM IST

పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని కాంగ్రెస్ సీనియర్​ నేత వీహెచ్​ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పలువురు రాజకీయ ప్రముఖులు మద్ధతు తెలిపారు. దీక్ష మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణలు అంబర్​పేటలోని వీహెచ్ నివాసానికి వెళ్లారు.

రాజ్యాంగం రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్​కు.. అవమానం జరిగిందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వీహెచ్ డిమాండ్ న్యాయమైనదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మార్పీఎస్​కు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా పాలన: భాజపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.