ETV Bharat / state

కరవుతో గిరాకి లేక దిగొచ్చిన ఎరువుల ధరలు - కరవుతో గిరాకీ లేక దిగివచ్చిన ఎరువుల ధరలు

వాతావరణ ప్రతికూల పరిస్థితుల వేళ... రసాయన ఎరువుల ధరలు తగ్గాయి. బస్తాకు 110 రూపాయల వరకు తగ్గడం కొంతలో కొంత కర్షకులకు ఉపశమనం కలిగించినట్లైంది. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలంలో వర్షాభావం, కరవు, దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎరువుల కంపెనీలు దిగొచ్చాయి. తాజాగా యూరియా మినహా... డీఏపీ, కాంప్లెక్స్ లాంటి రసాయన ఎరువుల ధరల తగ్గుదల వల్ల రాష్ట్ర రైతాంగానికి దాదాపు 180 కోట్ల రూపాయల వరకు భారం తగ్గనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

కరవుతో గిరాకీ లేక దిగివచ్చిన ఎరువుల ధరలు
author img

By

Published : Jul 20, 2019, 11:50 AM IST

కరవుతో గిరాకి లేక దిగొచ్చిన ఎరువుల ధరలు

యూరియా తప్ప మిగిలిన ఎరువుల ధరలను కంపెనీలు తగ్గించాయి. యూరియా కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంది. దాని ధర పెంచాలన్నా... తగ్గించాలన్నా... కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలి. మిగిలిన ఎరువులపై కేంద్రానికి నియంత్రణ లేదు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి కంపెనీలే ధరలు నిర్ణయిస్తాయి. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం ప్రారంభమై 50 రోజులు అవుతోంది. అయినా సరైన వర్షాలు కురవకపోడం, రైతుల నుంచి గిరాకీ సన్నగిల్లడం వెరసి ఎరువుల అమ్మకాలు తగ్గిపోవడం వల్ల అనివార్యంగా కంపెనీలు దిగొచ్చాయి. డీఏపీ 50 కిలోల బస్తా ధరపై 100 రూపాయలు, కాంప్లెక్స్ ఎరువులపై గరిష్టంగా 110 రూపాయల వరకు తగ్గించినట్లు ఇఫ్కో కంపెనీ శుక్రవారం ప్రకటించింది.

రైతులపై తగ్గనున్న భారం
కంపెనీలు అనేక రకాల బ్రాండ్ల పేరిట రసాయన ఎరువులను విక్రయిస్తున్నాయి. ఇఫ్కో నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ సంస్థకు ఎరువులు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు - ప్యాక్స్‌ ద్వారా మార్క్‌ఫెడ్ ఎరువులు విక్రయిస్తోంది. తాజాగా తగ్గించిన ధరల ప్రకారమే ఎరువులను రైతులకు విక్రయించాలని మార్క్‌ఫెడ్‌తోపాటు ఇఫ్కో కంపెనీ గ్రామాల్లో విక్రయదారులకు లిఖితపూర్వకంగా సందేశాలు పంపించింది. రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మొత్తం 18 లక్షల టన్నుల ఎరువులు రైతులు కొనుగోలు చేస్తారని వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఇందులో 9 లక్షల టన్నులు యారియా ఉంది. మిగిలిన 9 లక్షల టన్నులపై ధరల తగ్గింపు వల్ల రైతులకు దాదాపు 180 కోట్ల రూపాయల వరకు భారం తగ్గుతుందని అంచనా.

కొత్త ధరలకే అమ్మాలి
రసాయన ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం... ప్రతి బస్తాపై విధిగా గరిష్ట చిల్లర ధర - ఎమ్మార్పీ ముద్రించి రైతులకు విక్రయించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పాత ధరలు ముద్రించిన బస్తాలే చిల్లర దుకాణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు డీఏపీ బస్తాపై ఎమ్మార్పీ 1400 రూపాయలు ముద్రించి ఉంది. కానీ, దీనిని ఇక నుంచి 1300 రూపాయలకే విక్రయించాలని విక్రయదారులకు సూచించినట్లు ఇఫ్కో కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ మారుతీకుమార్ తెలిపారు. అలాగే, కాంప్లెక్స్‌ ఎరువులను కూడా కొత్త ధరలకే అమ్మాలని.... రైతులు సొమ్ము చెల్లించేటప్పుడు బస్తాపై ఎమ్మార్పీ చూసి తగ్గించి ఇవ్వాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో కొత్త ఎమ్మార్పీ ముద్రించిన బస్తాలు త్వరలో మార్కెట్‌లోకి పంపేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. ఇతర రసాయన ఎరువుల కంపెనీలు పాత ఎమ్మార్పీలు ఉన్న బస్తాల అమ్మకాలు పూర్తయ్యే వరకూ ఆగాలా లేదా అప్పుడే తగ్గించాలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: సికింద్రాబాద్​లో మహంకాళి బోనాల ర్యాలీ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.