Delhi Liquor Scam Case Updates: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి రిమాండ్‌ను.. ఈనెల 7 వరకు పొడిగించింది. ఈ మేరకు ఈడీ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోనికి తీసుకుంది. ఈ కేసులో ఈనెల 5న మరో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది.
సౌత్‌గ్రూప్ లావాదేవీలపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ పేర్కొంది. సమీర్ మహేంద్రు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనుంది. అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్లపై ఈనెల 4న.. శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై జనవరి 7న.. బినోయ్ బాబు బెయిల్ పిటిషన్‌పై జనవరి 9న విచారణ నిర్వహించనుంది.
ఇవీ చదవండి: