ETV Bharat / state

దిల్లీ మద్యం కేసు నిందితుల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ - Dinesh Arora Latest News

Delhi Liquor Scam updates: దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే నిందితుల స్థిరాస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ముగ్గురు నిందితులకు చెందిన 76.54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Delhi Liquor Scam Update
Delhi Liquor Scam Update
author img

By

Published : Jan 25, 2023, 3:30 PM IST

Delhi Liquor Scam updates: దిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు చెందిన రూ. 76.54 కోట్ల విలువైన ఆస్తులను.. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రు, గీతిక మహేంద్రులకు చెందిన దిల్లీలోని రూ. 35 కోట్ల విలువైన నివాస స్థలాలు అటాచ్‌ చేసినట్లు తెలిపింది. గురుగ్రామ్‌లో అమిత్ అరోరాకు చెందిన రూ.7.68 కోట్ల విలువైన ఆస్తులు.. ముంబయిలో విజయ్ నాయర్‌కు చెందిన రూ.1.77 కోట్ల విలువైన ప్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. దినేశ్ అరోరాకు చెందిన రూ.3.18 కోట్ల విలువైన రెస్టారెంట్‌ సహా.. హైదరాబాద్‌లో అరుణ్ పిళ్లైకు చెందిన రూ.2.25 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు మద్యం స్కామ్‌లో దిల్లీ ఖజానాకు రూ.2873 కోట్లు నష్టం జరిగినట్లు ఈడీ వెల్లడించింది.

నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్:​ అంతకుముందు ఈ నెల మొదటివారంలో దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్డిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఒక్కొక్కరికి రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. బెయిల్‌ పొందిన వారిలో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రులు ఉన్నారు.

దాదాపు 10వేల పేజీలతో తొలి ఛార్జిషీట్​: ఈ కేసులో అభిషేక్, విజయ్ నాయర్​కు ఇదివరకే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 25న మద్యం కేసులో దాదాపు 10వేల పేజీలతో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఏడుగురు నిందితుల పేర్లను ఛార్జిషీట్ ప్రస్తావించింది. ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌, ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి, సమీర్‌ మహేంద్రు, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ పేర్లను సీబీఐ పేర్కొంది.

స్టేట్​మెంట్ల ఆధారంగా ఈడీ ఛార్జిషీట్: ఇప్పటివరకు అరెస్ట్ అయిన సమీర్‌ మహేంద్రు, పి. శరత్ చంద్రారెడ్డి, బినయ్‌ బాబు, విజయ్‌ నాయర్, అభిషేక్‌ బోయినపల్లి ద్వారా తీసుకున్న స్టేట్​మెంట్ల ఆధారంగా ఈడీ ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మాగుంట రాఘవ్‌ రెడ్డి, కవితలు అసలు భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థ 14,05,58,890 బాటిళ్ల మద్యం విక్రయించి.. రూ.1,028 కోట్లు సంపాదించినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది.

ఇవీ చదవండి:

టీ కాంగ్రెస్​లో.. పెండింగ్‌ డీసీసీ అధ్యక్షుల నియామకంపై తొలగని సందిగ్ధత

దక్కన్ మాల్‌ బాధిత కుటుబాలకు పరిహారం.. ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం

ప్రధాని మోదీతో ఈజిప్టు అధ్యక్షుడు భేటీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు..

ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ హెలికాప్టర్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్​.. కారణమదేనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.