ETV Bharat / state

TSPSC Paper Leak Case Updates : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. ఫోరెన్సిక్‌ నివేదిక ఏది? - తెలంగాణ తాజా వార్తలు

TSPSC Paper Leak Case : టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానుంది. అయితే ఇప్పటికి పోలీసుల చేతికి అది అందకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇప్పటికే 50 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేసినా.. అసలు ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చిందన్న విషయం మాత్రం ఇంకా తేలడంలేదు. దీంతో పోలీసు అధికారులు ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

TSPSC Paper Leak Case Update
TSPSC Paper Leak Case Update
author img

By

Published : Jul 3, 2023, 9:45 AM IST

Delay in Forensic Report on TSPSC Paper Leak Case : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కీలకమైన ఫోరెన్సిక్‌ నివేదిక ఆలస్యమవుతుండడంతో.. దాని ప్రభావం దర్యాప్తుపై పడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసినా.. దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉంది. అంచెలంచెలుగా ప్రశ్నపత్రాలు చేతులు మారడంతో అరెస్టులు కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 52 మంది అరెస్టు కాగా.. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.

TSPSC Paper Leak Case Updates : ప్రశ్నాపత్రాలు బయటకు ఎలా వచ్చాయన్న చిక్కుముడి మాత్రం వీడడంలేదు. ఈ కేసు భవిష్యత్ అంతా దీనిపైనే ఆధారపడి ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్, తన మిత్రుడు రాజశేఖర్​రెడ్డితో కలిసి వాటిని బయటకు తెచ్చాడు. ఇద్దరూ కలిసి వీటిని తమ మిత్రులకు అమ్ముకున్నారు. ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం, అవి అంచెలంచెలుగా చేతులు మారడం వరకు నిర్ధారణ అయింది. అందుకే పరీక్షలు రాసిన అనుమానితులందరిని పోలీసులు అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండాల్సిన ప్రశ్నపత్రాలు ప్రవీణ్, రాజశేఖర్‌లు చేతికి ఎలా వచ్చాయన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.

TSPSC Paper Leakage Case : కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇంఛార్జి శంకరలక్ష్మి పుస్తకంలో రాసుకున్న.. పాస్‌వర్డ్‌ను చోరీ చేసి, దాని ద్వారా కంప్యూటర్‌ తెరిచి, ప్రశ్నపత్రాలు లీక్‌ చేశారని మొదట్లో భావించారు. ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి పోలీసులకు ఇదే విషయాన్ని చెప్పారు. శంకరలక్ష్మిని విచారించినప్పుడు మాత్రం పాస్‌వర్డ్‌ను తాను పుస్తకంలోనే రాసుకోలేదని చెప్పినట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తులోనూ ఇదే వెల్లడైంది. దాంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు దర్యాప్తును తప్పుదోవ పట్టించారని పోలీసులు భావించారు. దీనిపై మరింత సమాచారం కోసం పోలీసులు ఫోరెన్సిక్‌ విభాగాన్ని ఆశ్రయించారు.

TSPSC Paper Leakage Case Updates : పాస్‌వర్డ్‌ ఉపయోగించి కంప్యూటర్‌ను తెరిచారా? దాన్ని హ్యాక్‌ చేశారా? మరేదైనా అక్రమ మార్గం ఉపయోగించారా? అన్నది కూడా ఈ విచారణలో వెల్లడవుతుంది. అందుకే పోలీసు అధికారులు ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కంప్యూటర్లను విశ్లేషించి, పాస్‌వర్డ్‌ గుట్టు రట్టు చేయడానికి ఇప్పుడున్న పరిజ్ఞానం సరిపోవడం లేదని తెలుస్తోంది. అందుకే అత్యాధునిక పరిజ్ఞానం తెప్పించుకుంటున్నారని సమాచారం. కారణాలేవైనా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఫోరెన్సిక్‌ పరీక్షలు ఆలస్యం అవుతుండటం దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.