ETV Bharat / state

హైదరాబాద్ మెట్రోలో తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గుతోంది. కొన్ని రోజులుగా నగరంలో కరోనా కేసుల సంఖ్య క్రమేనా పెరుగుతుండటంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రాత్రి కర్ఫ్యూతో మెట్రో సమయాన్ని కుదించడంతో రోజుకు కేవలం లక్ష నుంచి లక్షా 20 వేలలోపు మాత్రమే మెట్రో ప్రయాణాలు చేస్తున్నారు. లాక్​డౌన్​ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తుండగా.. ఒక్కసారిగా కరోనా రెండో దశ ఉద్ధృతితో మరోసారి మెట్రోలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది.

Hyderabad Metro
Hyderabad Metro
author img

By

Published : Apr 27, 2021, 2:34 AM IST

కరోనా ప్రభావం మెట్రోపై తీవ్రంగా పడుతోంది. లాక్​డౌన్​ అనంతరం కొద్దికొద్దిగా మునుపటి స్థితికి చేరుకుంటున్న దశలో రెండోదశ కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్ మెట్రో ఎక్కడానికి నగరవాసులు వెనుకడుగు వేస్తున్నారు. మెట్రోలో పూర్తిస్థాయిలో కరోనా నిబంధనలు పాటిస్తున్నా.. జనాల్లో భయం మాత్రం పోవట్లేదు. గతేడాది లాక్​డౌన్​ వల్ల ఆరు నెలల విరామం తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినా ప్రయాణికుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది.

మెట్రోకు మంచి ఆదరణ ఉంటుందని అధికారులు భావించినా.. ఆశించిన మేర స్పందన రాలేదు. మూడు కారిడార్లలో కలిపి రోజుకు కేవలం 30 వేల మంది మాత్రమే ప్రయాణించారు. మెట్రో స్టేషన్లలో కాంటాక్ట్ లెస్ టికెటింగ్, శానిటైజేషన్, సామాజిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించడంతో క్రమేనా ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు చేరింది. హైటెక్ సిటీ–నాగోల్ కారిడార్లో ఎక్కువ రద్దీగా ఉండేది. ఎక్కువగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు మెట్రోను అధికంగా ఉపయోగించుకునేవారు. అయితే లాక్​డౌన్​లో చాలా వరకు సాఫ్ట్​వేర్​ సంస్థలు ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం ఇవ్వడంతో మెట్రో ఎక్కే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్​డౌన్​ తర్వాత తిరిగి ప్రారంభించినా.. 2 లక్షల ప్రయాణికుల కంటే మించిన సందర్భాలు ఉండటం లేదు.

కర్ఫ్యూ ఎఫెక్ట్​..

ముఖ్యంగా గత పది, 15 రోజులగా నగరంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. సొంత వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. వీటన్నింటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో రాత్రి 7.45 నిమిషాలకే చివరి ట్రైన్ కావడంతో.. ఫిబ్రవరి, మార్చిలో రోజుకు 2 లక్షల వరకు చేరిన ప్రయాణికుల సంఖ్య.. గత వారం రోజులగా కేవలం లక్ష నుంచి లక్ష 20 వేలకే పరిమితమవుతోంది.

ఇదీ చూడండి: మే 3 నుంచి 31 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.