ETV Bharat / state

చిన్నారి సమాధి వద్దకు సారె.. ఎందుకంటే...! - ఏపీ తాజా వార్తలు

పండుగలు అంటే గ్రామాల్లో సాధారణంగా.. అమ్మవారి పేరునో లేదంటే గ్రామదేవతల పేరున ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ.. ఆ గ్రామంలో మాత్రం ఓ చిన్నారి వర్థంతిని తీర్థ మహోత్సవంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున జాతర నిర్వహించి మెుక్కులు చెల్లించుకోవటం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఆలస్యం చేయకుండా ఈ కథనాన్ని చదివేయండి.

చిన్నారి సమాధి వద్దకు సారె.. ఎందుకంటే...!

author img

By

Published : Feb 4, 2021, 7:54 PM IST

చిన్నారి సమాధి వద్దకు సారె.. ఎందుకంటే...!

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా రోలుగుంట మండలం భోగాపురంలో.. చిన్నారి వర్థంతిని గ్రామస్థులు తీర్థమహోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఏడేళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ.. చిన్నారి సమాధి వద్ద మెుక్కులు సైతం చెల్లించుకుంటున్నారు. భోగాపురానికి చెందిన సీతారామమూర్తి, ఉమా నాయుడు ఏకైక కుమార్తె.. చందన అలియాస్ అమ్ము ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆ చిన్నారి జ్ఞాపకార్థంగా.. చిన్నారి సమాధి వద్ద తల్లిదండ్రులు ఏటా భారీగా తీర్థ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఇంటి వద్దే సమాధిని ఏర్పాటు చేసి.. అందంగా పూలతో అలంకరించి, చిన్నారికి ఇష్టమైన తినుబండరాలు, స్వీట్లు, ఫలహారాలు, పిండివంటలు.. పట్టు వస్త్రాలను సమాధి చుట్టూ పేర్చుతారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు. 2,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. చిన్నారి వర్థంతిని ఈ విధంగా తీర్థ మహోత్సవాన్ని నిర్వహించటం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి : పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏమి చేయదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.