ETV Bharat / state

చచ్చినా సమస్యే: రెండురోజులుగా అంత్యక్రియలకు నిరీక్షణ - తిమ్మరాజుపురంలో శవం అంతక్రియల వార్తలు

ఎంత బతికినా చివరకు చేరేది అరడుగుల నేలలోకే.. సొంత భూములు ఉన్నవారు తమ స్థలాల్లోనే అయినవాళ్లకు అంత్యక్రియలు చేస్తారు. భూములు లేనివాళ్లు శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఊళ్లో శ్మశానం లేకపోతే ?

ఖననానికి లేని చోటు.. రెండు రోజులుగా అంత్యక్రియలకు నిరీక్షణ
author img

By

Published : Nov 20, 2019, 3:16 PM IST

చిత్తూరు జిల్లా వి. కోట మండలం తిమ్మరాజుపురం గ్రామంలో శ్మశానం లేక ఓ శవం రెండు రోజులనుంచి అంత్యక్రియలకు నోచుకోలేదు. ఎనభై ఏళ్ల వృద్ధురాలు వెంకటమ్మ మృతి చెంది రెండు రోజులవుతున్నా... ఆమెను పూడ్చేందుకు స్థలం లేకపోవడంతో బంధువులు భూమి కోసం పోరాడుతున్నారు. వాగుపక్కనే ఉన్న స్థలాన్ని ఇటీవల శ్మశానానికి అధికారులు కేటాయించారు. అయితే ఆ భూమిని సాగు చేసుకుంటున్న దళితులు దానిని ఇచ్చేది లేదంటూ భీష్మించి కూర్చోవడంతో సమస్య తీవ్రతరమైంది.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్వే చేసి ఆ భూమి శ్మశానమని తేల్చినా... ఇవ్వబోమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో తిమ్మరాజపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్నేళ్లనుంచి ఎవరైనా మృతి చెందితే వారి పొలాల్లోనే ఖననం చేసుకునేవారు. తాజాగా మృతి చెందిన వెంకటమ్మకు సొంత భూమి లేకపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. భూమిలేని పేదలను ఎక్కడ పాతి పెట్టాలంటూ గ్రామంలో ఓ వర్గం పట్టుబడటంతో శ్మశాన స్థలం కోసం ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఖననానికి లేని చోటు.. రెండు రోజులుగా అంత్యక్రియలకు నిరీక్షణ

ఇదీచూడండి.చంద్రగిరిలో ఇరువర్గాల ఘర్షణ... యువకునిపై కత్తితో దాడి

Intro:ap_tpt_51_19_dead_body_waiting_for_funeral_avb_ap10105

అంత్యక్రియల కోసం మృతదేహం ఎదురుచూపులుBody:చిత్తూరు జిల్లా వి కోట మండలం తిమ్మరాజు పురం గ్రామంలో శ్మశానం కోసం స్థలం లేకపోవడంతో వెంకటమ్మ అనే ఎనభై ఏళ్ల వృద్ధురాలి మృతదేహం నిరీక్షణ.

వెంకటమ్మ మృతి చెంది రెండు రోజులవుతున్నా ఆమెను పూడ్చేందుకు శ్మశాన స్థలం లేకపోవడంతో బంధువులు భూమి కోసం పోరాటం చేస్తున్నారు.

వాగుపక్కనే ఉన్న స్థలాన్ని ఇటీవల శ్మశాన స్థలంగా మార్పు చేసినా దానిని సాగు చేసుకుంటున్న దళితులు ఆ భూమిని ఇవ్వమంటూ భీష్మించి కూర్చోవడంతో సమస్య తీవ్రతరమైంది.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్వే చేసి శ్మశాన స్థలాన్ని తేల్చిన ఆభూమిని ఇవ్వమంటూ దళితులు.. ఇచ్చి తీరాల్సిందేనంటూ బోయలు ..పట్టుపట్టడంతో సమస్య జటిలమైంది.

దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో తిమ రాజపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇన్నేళ్లు ఎవరి ఇంట్లో అయినా ఎవరైనా మృతి చెందితే వారి వారి పొలాల్లోనే ఖననం చేసుకునే వారు. తాజాగా మృతి చెందిన వెంకటమ్మకు సొంత భూమి లేకపోవడంతో సమస్య ఉత్పన్నమైంది.

భూమిలేని పేదలను ఎక్కడ పాతి పెట్టాలంటూ గ్రామంలో ఓ వర్గం పట్టుబడడంతో శ్మశాన స్థలం కోసం ఆందోళనలకు దిగారు..

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.