ETV Bharat / state

పాపం వి'లాస్‌' పురుషులు! - Dating website cheating hyderabad

సైబర్​ నేరాలను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఆన్​లైన్​ మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో నేరాలను చేస్తూ పోలీసులకు సవాల్​ విసురుతున్నారు. తాజాగా ఓ నూతన మోసం వెలుగులోకి వచ్చింది. యువకులపై సైబర్‌ నేరగాళ్లు సమ్మోహనాస్త్రం సంధిస్తున్నారు. ‘వలపు ఆశ చూపి... యువతులతో ఫోన్లు చేయిస్తూ సొమ్ము స్వాహ చేస్తున్నారు.

Cyber Crime
Cyber Crime
author img

By

Published : Feb 22, 2020, 10:08 AM IST

‘యువతీ, యువకులు కలుసుకునేందుకు... ఒకట్రెండు రోజులు సరదాగా గడిపేందుకు అనువైన వేదికలను అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్నాం. మాకు వందల సంఖ్యలో వినియోగదారులున్నారు. వీరిలో 80 శాతం మంది యువతులే. వారితో గడిపేందుకు యువకులు.. విద్యార్థులకు అవకాశం. ‘ప్లేబాయ్‌’గా మారి ఆనందించండి... రూ.లక్షల్లో ఆదాయం సంపాదించండి’.

(ఓ వెబ్‌సైట్‌లో సైబర్‌ నేరస్థులిస్తున్న ప్రకటన ఇది)

సుమారు 15 డేటింగ్‌ వెబ్‌సైట్లలో ఇలాంటి ‘'వల'’పు ప్రకటనలు కనిపిస్తున్నాయి. నెలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ ఆదాయం ఉంటుందని ఆశ చూపుతున్నారు. తమకు పది శాతం కమీషన్‌ ఇవ్వాలని... ఫొటోలు, వీడియోలతో పాటు రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలని పేర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు, యువకులు ఈ ప్రకటనలకు ఆకర్షితులై రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. నేరగాళ్ల బారినపడి తన ఖాతాల నుంచి రూ.వేలు, రూ.లక్షల నగదు బదిలీ చేస్తున్నారు.

బంజారాహిల్స్‌ .. జూబ్లీహిల్స్‌ .. రిసార్టులు..

వెబ్‌సైట్ల ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారికి సైబర్‌ నేరస్థులు ఫోన్లు చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, చిరునామాలు తెలుసుకున్న అనంతరం రెండు, మూడు రోజుల్లో తమ వినియోగదారులు నేరుగా ఫోన్‌ చేస్తారని చెబుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని ఫ్లాట్లు, శివార్లలోని రిసార్టులకు యువతులు ఆహ్వానిస్తారని, వారు తెలిపిన ప్రాంతం వివరాలు చెబితే కారు పంపుతామని వివరిస్తున్నారు.

యువతులతో ఫోన్లు... మాయమాటలతో నగదు బదిలీ

రెండు రోజుల్లోనే బాధితులకు యువతుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ‘మీరు మా ఫ్లాట్‌కు రండి... కలిసి భోంచేద్దాం... నాకు మద్యం తాగే అలవాటుంది.. మీకూ ఇష్టమేనా’ అంటూ ఆ యువతులు వల వేస్తారు. మద్యం, మంచి ఆహారం తీసుకురండి అని చెప్తారు. ప్రస్తుతం తమ వద్ద క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు లేనందున మీరే తీసుకురావాలంటారు. తీరా యువకులు... తానున్న చోట హోటళ్లు లేవని బదులిస్తే... తన స్నేహితురాలి ఖాతాకు నగదు బదిలీ చేస్తే మీరు వచ్చేసరికి ఆహార పానీయాలు సిద్ధం చేసి ఉంచుతామని మరింతగా నమ్మిస్తున్నారు. యువతి సూచించిన ఖాతాల్లోకి బాధితుడు నగదు బదిలీ చేయగానే.. సైబర్‌ నేరస్థులు, అప్పటి వరకూ మాట్లాడిన యువతి ఫోన్లు స్విచ్చాఫ్‌ చేస్తున్నారు. ఇలా సికింద్రాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి రూ.95 వేలు, మాదాపూర్‌లో ఓ యువకుడు రూ.65 వేల నగదు బదిలీ చేశారు.

పరువు పోతుందని బాధితులు చెప్పట్లేదు

- కె.వి.ఎం. ప్రసాద్‌, ఏసీపీ సైబర్‌ క్రైమ్స్‌

సైబర్‌ నేరస్థుల బారిన పడిన చాలామంది బాధితులు పరువు పోతుందని మాకు చెప్పడం లేదు. వారం వ్యవధిలో కేవలం ఇద్దరు ఫిర్యాదులు చేశారు. ఒక కేసులో దమ్మాయిగూడెం నివాసి దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశాం. అతడు తొమ్మిది మందిని మోసం చేసినట్లు అంగీకరించాడు. ఇలాంటి మోసాలు బెంగళూరు, ముంబయి నగరాల తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. యువకులు వీటిని నమ్మి నష్టపోవద్దు.

ఇవీ చూడండి: మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.