ETV Bharat / state

సైబర్​మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కేంద్రం - anjanikumar

సైబర్​ మోసాలను నిరోధించేందుకు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్​లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ వెరీజాన్​ వచ్చే ఏడాదికి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

data-theft
author img

By

Published : May 8, 2019, 6:48 PM IST

సైబర్​నేరగాళ్ల ఆటకట్టించేందుకు దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు పూనుకుంది. సైబర్​ మోసాల నివారణకు ఓ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ వెరీజాన్​కు అప్పగించింది. వచ్చే ఏడాదికి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. డేటా చౌర్యంపై అధ్యయనం చేసిన వెరీజాన్​ సంస్థ ఇందుకు సంబంధించిన నివేదికలను విడుదల చేసింది. కార్యక్రమంలో హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ పాల్గొన్నారు. అంతర్జాలంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్​ మోసాలపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సైబర్​మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కేంద్రం
ఇదీ చదవండి: ఐటీ గ్రిడ్​లో సోదాలు ప్రారంభం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.