ETV Bharat / state

Dairy Farmers Issues Telangana : ఒడిదొడుకుల్లో పాడిరైతులు.. ఐదేళ్లయినా అందని ప్రోత్సాహకాలు - తెలంగాణ వార్తలు

Telangana Dairy Farmers Crisis : రాష్ట్రంలో పాడి రైతులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అనుబంధ పాడి రంగం బలోపేతం, పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా అధికారుల ఉదాసీనతతో క్షేత్రస్థాయిలో అవి సరిగా అమలుకు నోచుకోవడం లేదు. వాతావరణ మార్పులతో ఏటికేడు పాల ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నా.. అందుకు తగ్గట్టు గిట్టుబాటు ధరలు లభించక పాడిరైతులు అల్లాడిపోతున్నారు. పొరుగు రాష్ట్రాలపై పాల కోసం ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి బయటపడేలా స్వయంసమృద్ధి సాధించే దిశగా పాలకు ప్రోత్సాహక ధరలు, ఇతర రాయితీలు అందించాలని రైతులు కోరుతున్నారు.

MILK
MILK
author img

By

Published : Jun 27, 2023, 8:45 AM IST

ఒడిదొడుకుల్లో పాడిరైతులు.. ఐదేళ్లయినా అందని ప్రోత్సాహకాలు

Telangana Dairy Farmers Problems : రాష్ట్రంలో పాడి రంగం కునారిల్లుతోంది. సంప్రదాయంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధంగా వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేసిన పాలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఏయేటికాయేడు ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటంతో ఆశించిన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో చిన్న, చిన్న డెయిరీలు మూతపడుతోన్నాయి. ప్రధాన ఆహార పంట వరిసహా పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ధతు ధరలు ఉన్నట్లే... పాలకు కనీస ధరల వ్యవస్థ లేకపోవడంతో భరోసా ఉండటం లేదు. ఫలితంగా

Dairy Farmers Issues Telangana : తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ సంస్థకు పాలు పోసే రైతులకు ప్రతి లీటరుపై రూ.4 చొప్పున ప్రభుత్వం ఇస్తున్న అదనపు ప్రోత్సహకాలు ఇటీవల కాలంలో చెల్లించడం లేదు. ఆరంభంలో మూడు నాలుగు మాసాలకోసారి విడతల వారీగా కొంత సమయానుకూలంగా చెల్లించడం వల్ల కొంత సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అమలు లోపభూయిష్టంగా మారడంతో రైతులకు కొత్త కష్టాలు, చిక్కులు వచ్చి పడ్డాయి.

'2014 నుంచి ప్రతి లీటరుకు రూ.4 విడతల వారీగా మూడు నెలలకు ఒకసారి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 15రోజులకి ఒకసారి ఇన్సెంటివ్స్ ఇస్తామని ఒప్పందాలు చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీకి పాలు పోస్తున్నా.. పాడి రైతులకు ఇన్సెంటివ్స్ మాత్రం అందడం లేదు.' - బాధిత రైతు

Delay In Subsidy to Dairy Farmers : రాష్ట్రంలో పాడి రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధంగా లక్షల పెట్టుబడితో ఉత్పత్తి చేసిన పాలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మద్దతు ధరలు కరవై నానాటికీ చిన్న, చిన్న డెయిరీలు మూతపడుతున్నాయి. ప్రధాన ఆహార పంటలకు కనీస మద్ధతు ధరలు ఉన్నట్లే... పాలకు కనీస ధరల వ్యవస్థ లేకపోవడం కర్షకులకు కంటగింపుగా మారింది. రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య సంస్థకు పాలు పోసే రైతులకు లీటరుపై రూ.4 చొప్పున ప్రభుత్వం ఇస్తున్న అదనపు ప్రోత్సహకాలు ఇటీవల సకాలంలో చెల్లించడం లేదు. ప్రమాదశాత్తూ గేదె మృత్యువాతపడ్డా బీమా సౌకర్యానికి నోచుకోవడంలేదు. బ్యాంకర్ల నుంచి రుణ సౌకర్యం విషయంలోనూ మద్దతు కరవైందని పాడి రైతులు నిరసన వ్యక్తం చేశారు.

'విజయ డైరీని వెనుక పడేస్తున్నారు. రైతులు పాలు పోయడానికి సిద్ధంగా ఉన్నా.. అధికారలు మాత్రం తీసుకోడానికి రెడీగా లేరు. ప్రైవేటు వారికి తొత్తులుగా ఉన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. గేదెలకు, ఆవులకు సబ్సిడీ ఇస్తామంటే వందల మంది డీడీలు కట్టాము. అధికారుల వైఫల్యమా లేకా ప్రభుత్వానిదా తెలియదు కానీ మాకు మాత్రం సబ్సిడీ రావడం లేదు.' - బాధిత రైతు

రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహ‌కాన్ని 2014 నుంచి ప్రారంభించింది. ఇప్పటి వరకు 373 కోట్లను ఈ పథకం కింద‌ పాల ఉత్పత్తిదారులకు అంద‌జేసింది. సరైన పర్యవేక్షణ లోపించి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు బలహీనపడ్డాయి. దాదాపు ఒక్క సంఘం నిబంధనల ప్రకారం కార్యకలాపాలు నిర్వహించడం లేదు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విషయాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.