ETV Bharat / state

ఆన్​లైన్​లో పరీక్ష.. వాట్సాప్​లో డిగ్రీ పట్టా.. చివరకు కటకటాలపాలు - నకిలీ సర్టిఫికెట్ల పేరుతో దందా

Fake Certificates Gang Arrest: సులభంగా డబ్బుసంపాదించే దురాశ కొందరిదైతే... చదువుకోకున్నా సమాజంలో హోదా పొందాలనే తపన మరికొందరిది. అదే సమాజాన్ని పెడపోకడలకు దారితీస్తోంది. అర్హత ఉన్న వ్యక్తులు నష్టపోవడానికి కారణం అవుతోంది. మేఘాలయలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ పేరుతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ఓ ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

Fake Certificates
Fake Certificates
author img

By

Published : Nov 15, 2022, 5:56 PM IST

Fake Certificates Gang Arrest: విశాఖకు చెందిన షేతక్‌ఖాజా నాలుగునెలల క్రితం నుంచి హైదరాబాద్‌ మియాపూర్‌లో ఉంటున్నాడు. డిగ్రీ పట్టాకోసం స్నేహితుడు ప్రేమ్‌కుమార్‌ను సంప్రదించాడు. సికింద్రాబాద్‌కు చెందిన సత్యనారాయణ శర్మ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడని అతను డిగ్రీ పట్టా సమకూరుస్తాడని తెలపగా... షేక్‌ఖాజా బీఎస్సీ కోర్సుకు దూరవిద్యా విధానంతో పట్టాకావాలని కోరాడు. మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా పనిచేసిన అఖిలేష్‌, ప్రవీణ్‌ తెలుసని చెప్పాడు.

వారి సహకారంతో కోర్సుకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించాడు. తగిన ధ్రువపత్రాలు తీసుకున్నాడు. డిగ్రీ పట్టా కోసం 2 లక్షల 10వేల రూపాయలు కట్టాలని చెప్పాడు. నగదు బదిలీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఎంజీ యూవర్సిటీ పేరిట 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగా ప్రేమ్‌కుమార్‌కు వాట్సాప్‌లో సర్టిఫికేట్లు పంపారు. వాటిని తనిఖీ చేయగా నకిలీవని తేలడంతో మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మేఘాలయ మహాత్మగాంధీ యూనివర్సిటీ పేరుతో నకిలీ డిగ్రీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. యూనివర్సిటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కనుసన్నల్లో... ఆ నకిలీ దందా జరుగుతోందని గుర్తించారు. అతనితో సహా ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఒక్కో డిగ్రీ పట్టాకు లక్షన్నర నుంచి రెండున్నర లక్షలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు ఇప్పటివరకు సుమారు 430 మందికి పట్టాలు విక్రయించారని వెల్లడించారు. వారి బ్యాంకు ఖాతాల్లోని 34 లక్షల 45 వేలు, 157 మహాత్మగాంధీ యూనివర్సిటీ మెమోలు గుర్తించారు. 11 కాన్వకేషన్‌ ఫైళ్లు, 9 ల్యాప్‌టాప్‌లు, ఏడు ఫోన్లు, విద్యార్థుల రికార్డుల డైరీని స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నకిలీ పట్టాలు కొన్నవారిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.