మహిళల భద్రతే తమ ప్రథమ లక్ష్యమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. షీ బృందాల ద్వారా మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐజీ స్వాతిలక్రా, ఫెస్సి థామస్, సినీనటి సాయి పల్లవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చిన్నారుల కోసం ఏడాది పొడవునా ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల సీసీ కెమెరాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లో మొత్తం 3.5 లక్షల సీసీ కెమెరాలున్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు