Cyber crime police notices to social media trollers: సోషల్ మీడియా... రెండు వైపుల పదును ఉన్న కత్తి లాంటిదని చెప్పవచ్చు. అయితే దీనితో మంచి ఎంత ఉంటుందో.. చెడు కూడా అంతే ఉంటుందని చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియా వచ్చాక... ఏ న్యూస్ అయిన క్షణాల్లో చేరిపోతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఏ చిన్న తప్పు చేసినా... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నవి మనం చూస్తునే ఉన్నాం.
Trolls on MLC Kavitha: అయితే సోషల్ మీడియాను కొంత మంది తప్పుగా వాడుతున్నట్లు తెలుస్తోంది. కావాలనే వ్యక్తులను టార్గెట్ చేస్తూ... వారిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రోలర్స్‌కు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 20 మంది ట్రోలర్స్‌పై కేసులు నమోదు చేశారు. 8 మంది ట్రోలర్స్‌కు 41(ఎ) కింద నోటీసులు జారీ చేశారు. సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు వీరంతా తప్పుడు మార్గాలను ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
సెలబ్రిటీల వీడియోలను, ఫొటోలను మార్ఫింగ్ చేసి... అప్ లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెబుతున్నప్పటికీ... ట్రోలర్స్ మాత్రం సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Delhi Liquor Scam Latest Updates: ఈ మధ్య కాలంలో చర్చనీయంశమైన దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం గురించి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కవిత గురించి కూడా ఇటీవల ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. వ్యూస్ కోసం యువత ట్రోలింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు మార్ఫింగ్ చేస్తున్నారు. సెలబ్రెటీల వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. ఫోటో, వీడియోల మార్ఫింగ్ చట్టరీత్యా నేరం. మహిళలను కించపరిచేలా ట్రోల్స్, మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలపై ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఇటీవల ఎక్కువగా ట్రోలింగ్ జరిగింది. వ్యూస్ కోసం యువత ట్రోలింగ్ చేస్తున్నారు. కొంత మందికి 41 ఏ కింద నోటీసులు కూడా ఇచ్చాం. ఇకపై మళ్లీ ఇలాంటివి జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - డీసీపీ స్నేహా మెహ్రా
ఇవీ చూడండి :