ETV Bharat / state

అందంతో ఎరవేసి.. ప్రవాసుడి వద్ద రూ. లక్షలు కొల్లగొట్టారు - హనీ ట్రాపింగ్​ ద్వారా ప్రవాస భారతీయుని వద్ద నగదు చోరీ

ప్రవాస భారతీయున్ని మోసం చేసిన కేసులో హైదరాబాద్​ జూబ్లీహిల్స్​కు చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. కేసులో ఆమె భర్త పరారీలో ఉన్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఈ కుటుంబం ఓ ప్రవాసుని వద్ద నుంచి రూ. 65 లక్షలు కొల్లగొట్టారు.

Cyber_Cheater_Malavika_Arrest  at jubilee hills in hyderabad
అందంతో ఎరవేసి.. ప్రవాసుడి వద్ద రూ. లక్షలు కొల్లగొట్టారు
author img

By

Published : May 28, 2020, 10:05 PM IST

Updated : May 29, 2020, 2:32 PM IST

మ్యాట్రిమోనీ​ నుంచి ప్రవాస భారతీయునికి ప్రేమతో దగ్గరైంది. నా దగ్గర చాలా ఆస్తి ఉంది.. కానీ అవి రావాలంటే పెళ్లికావాలంది. ఆస్తులకు సంబంధించి చట్టపరమైన సమస్యలు తొలగించుకునేందుకు డబ్బులు కావాలంది. నమ్మిన ఆ వ్యక్తికి నష్టమే మిగిలింది. జూబ్లీహిల్స్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆమెను.. ఇందుకు సహకరించిన కొడుకును అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి భర్త పరారీలో ఉన్నాడు.

ఏం చేశారంటే...

విలాసానికి అలవాటుపడిన ఓ కుటుంబం... ప్రవాసభారతీయుడిని మోసం చేసి రూ. లక్షల్లో డబ్బులు దోచుకున్నారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​కు చెందిన మాళవిక ఓ మ్యాట్రిమోనీలో నకిలీ అకౌంట్​ను తెరిచింది. తన పేరు కీర్తి అని వైద్యురాలిగా నమోదు చేసుకుంది. ఇందుకు భర్త, కుమారుడు తమ వంతు సహాయమందించారు. క్యాలిఫోర్నియాకు చెందిన వరుణ్​ అనే సాఫ్ట్​వేర్ ఇంజనీర్​ ఆమె ప్రొఫైల్​ చూసి చాటింగ్ ప్రారంభించాడు.

నమ్మించేందుకు కథలు..

అతన్ని నమ్మించేందుకు మాళవిక కథ అల్లింది. తనకు రూ. కోట్ల ఆస్తులున్నాయని.. తన తల్లి వేధింపుల వల్ల బయటకు వచ్చి స్వతంత్రంగా బతుకుతున్నానని నమ్మబలికింది. వివాహమైతే ఆస్తులన్నీ తన పేరిట మారుతాయని చెప్పింది. ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు పరిష్కరించుకునేందుకు రూ. 65 లక్షలు కావాలని కోరింది. దీనికి వరుణ్​ ఆమె ఖాతాలోకి డబ్బు పంపించాడు.

మోసపోయానని తెలుసుకుని...

ఇంకేముంది... ఒక్కసారి డబ్బులొచ్చాక మరి కనిపించలేదు మాళవిక. మోసపోయానని గుర్తించిన వరుణ్​ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులైన మాళవిక దంపతులపై బోయిన్​పల్లి, నల్లకుంట సైబర్​ క్రైం పోలీస్​స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలతో మాళవికను, కొడుకు ప్రణవ్​ను పట్టుకున్నామని... భర్త పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Last Updated : May 29, 2020, 2:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.