శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం రాత్రి జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తిని తనిఖీ చేయగా లైఫ్ జాకెట్లో దాచిన పుత్తడిని అధికారులు గుర్తించారు. మొత్తం 932 గ్రాముల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలు వరకు ఉంటుందని తెలిపారు.
ఇవీ చూడండి: "మహానగరంలో భూ మాయ"